
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్‌మెట్ డివిజన్ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్‌జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరెడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్‌ఈసీ తెలపగా, అందుకు సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. ఇందుకు గాను సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. (నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత)
Comments
Please login to add a commentAdd a comment