ghmc elections results
-
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్పుకే ప్రజల ఓటు
నెల్లూరు (మినీ బైపాస్): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం ఫలితాల ద్వారా స్పష్టమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే ఈ నెల 7న నిరసన దీక్షలు నిర్వహిస్తామన్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమని పేర్కొన్నారు. -
‘ఆ ఫలితంపై అత్యవసర జోక్యం అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్మెట్ డివిజన్ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్‌జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరెడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలపగా, అందుకు సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. ఇందుకు గాను సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. (నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత) -
‘ఒకరు మతం.. మరొకరు డబ్బు రాజకీయం’
నల్లగొండ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని చూస్తే, టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సే అని, గెలుపు ఓటములన్నది సహజమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, యోగి తదితర నేతలు హైదరాబాద్‌కు వచ్చి మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వెదజల్లిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు మత ప్రాతిపదికన తరహాలో జరిగాయని ఆరోపించారు. దుబ్బాకలో కూడా ఇదే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ బలహీనపడ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్ర వి«ధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అలాంటి ఉద్యమాలే రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. -
సర్కారు ఉద్యోగుల అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార టీఆర్ఎస్ పారీ్టకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసి తమ అసమ్మతి తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు లభించాయి. ఉద్యోగుల సమస్యల పెండింగ్ వల్లే.. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బందితో పాటు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో వెనకబడిన అధికార టీఆర్ఎస్.. సాధారణ ప్రజానీకం ఈవీఎం/బ్యాలెట్ పేపర్ ద్వారా వేసే ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో టీఆర్ఎస్ వెనకబడిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం, ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచకపోవడం, స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు చేపట్టకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో పలుమార్లు హామీనిచి్చనా, నెరవేర్చలేకపోయారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఓట్ల నుంచి జీహెచ్ఎంసీ వరకు.. ఇక 2018లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 95,689 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా, అత్యధికంగా కాంగ్రెస్ పారీ్టకి 38,918, టీఆర్ఎస్కు 32,880, బీజేపీకు 9,567 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమికి వచ్చిన మొత్తం పోస్టల్ ఓట్ల సంఖ్య 46,651 కావడం గమనార్హం. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తంగా 46.87 శాతం ఓట్లను సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 శాతం ఓట్లతో కేవలం ఒకే సీటును గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పోలైన 906 పోస్టల్ ఓట్లలో బీజేపీకు 515 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు కేవలం 218 ఓట్లు మాత్రమే లభించాయి. ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా అసమ్మతి తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
కారు ‘కంగు’.. కమలం ‘స్వింగు’.. గ్రేటర్ హంగు
సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మహామహుల ప్రచారాలతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాక రేపినగ్రేటర్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా.. అధికార టీఆర్ఎస్ జోరు తగ్గి వెనకబడింది. మొత్తం 150 డివిజన్లకుగాను నేరెడ్మెట్ ఫలితం (ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది) మినహా 149 స్థానాల్లో విజేతలను ప్రకటించారు. కారు 55 డివిజన్లలో దూసుకెళ్లగా.. 48 స్థానాల్లో కమలం వికసించింది. ఇక ఎంఐఎం పతంగి 44 స్థానాల్లో రెపరెపలాడింది. కాంగ్రెస్ తన రెండు స్థానాలకే పరిమితమైంది. ఇక హంగ్ ఏర్పడిన కారణంగా మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ ఎలా కైవసం చేసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి బల్దియా మేయర్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 195 ఉండగా.. పీఠం దక్కించుకోవడానికి 98 మంది మద్దతు అవసరం. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్కు 86 మంది బలం మాత్రమే ఉండటంతో మేయర్ కుర్చీకి కొద్ది అడుగుల దూరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పీఠం కైవసానికి టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని తేల్చిచెప్పారు. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో హంగ్ ఏర్పడింది. కారు స్పీడుకు బ్రేక్ పడగా... కమలం వికసించింది. టీఆర్ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి. దుబ్బాక విజయంతో గ్రేటర్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ అంచనాలకు మించి రాణించింది. అనూహ్యంగా 48 డివిజన్లలో విజయం సాధించింది. కిందటిసారి నాలుగు సీట్లు మాత్రమే గెలిచిన కమలదళం... ఈసారి సర్వశక్తులూ ఒడ్డి అంతకు ఎన్నోరెట్ల విజయాన్ని నమోదు చేసింది. భవిష్యత్తులో తెలంగాణలో ఎదగడానికి కావాల్సిన ఉత్సాహం బీజేపీకి లభించింది. పాతబస్తీపై తమ పట్టును మజ్లిస్ మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. కిందటిసారి లాగే కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టీడీపీ గొప్పకు పోయి 106 స్థానాల్లో పోటీచేసినా... ప్రజలు అదొక పార్టీ ఉందనే గుర్తించలేదు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. వరద ‘దెబ్బే’! టీఆర్ఎస్ అంచనాలు తల్లకిందులు కావడానికి వరదలు ప్రధాన కారణమ య్యాయి. ఎన్నికలకు ముందు వరదసాయం కింద బాధితులకు రూ.10 వేల చొప్పున అందించిన నగదుపరిహారమే దెబ్బకొట్టింది. అర్హులైన అందరికీ సహాయం అందకపోవడం, పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకలు, తర్వాతి దశలో దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి మీసేవ కేంద్రాల ముందు నిలబడ్డా... ఆఖరికి సాయం అందకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. దాన్ని ఓట్ల రూపంలో చూపించారు. గ్రేటర్లో టీఆర్ఎస్ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. పై అంతస్తుల్లో ఉన్నవారికి అందిన సాయం నిజంగా దెబ్బతిన్న కుటుంబాలకు అందకపోవడం లాంటి ఘటనలూ జనంలో వ్యతిరేకతను పెంచాయి. నగదు రూపంలో అందజేసిన వరదసాయాన్ని స్థానిక నాయకులు సొంతజేబుల్లో వేసుకున్నారని, తమ అనుయాయులకే ఇప్పించుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వరదతాకిడికి బాగా దెబ్బతిన్న ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, సరూర్‌నగర్, చంపాపేట, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఓటమికి వరదసాయంలో అవకతవకలు, అర్హులైన వారికి అందకపోవడమే కారణమని చెబుతున్నారు. డివిజన్‌కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించి... పకడ్బందీగా ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఈస్థాయిలో వ్యతిరేకతను ఊహించలేకపోయింది. కిందటి ఎన్నికల్లో కంటే కొన్నిసీట్లు తగ్గినా... ఎక్స్అఫీషియో బలంతో సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమనే భావించింది. కానీ వారి అంచనాలు తప్పాయి. కమలం... సక్సెస్ భావోద్వేగాలపై ప్రచారం సాగించి బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ లాభపడింది. భవిష్యత్తులో బలపడే అవకాశాలున్నాయని పసిగట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం... ఒక కార్పొరేషన్ ఎన్నికే అయినా గ్రేటర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయకులు పలువురు ప్రచారం నిర్వహించడం, వరదసాయం నగదుపంపిణీలో అవతకవకల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం... కలిసొచ్చాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ఓటర్లలో విశ్వాసాన్ని కలిగించడంలో కాషాయదళం సఫలమైంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనడం, రోహింగ్యాలకు, అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలతో హిందువుల ఓట్లను బీజేపీ ఆకర్షించగలిగింది. బల్దియా ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్ఎస్ తొందరపాటు సైతం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని, నేతల్ని ప్రజలు విశ్వసించలేదు. వాళ్లు ఎన్నోకొన్ని సీట్లు గెలిచినా ఒరిగేదేమీ ఉండదనే తలంపుతోనూ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు. ఇక టీడీపీ 106 వార్డుల్లో పోటీచేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. రెండు నెలలు ఆగాల్సిందే... జీహెచ్ఎంసీలో కొత్త పాలకమండలి కొలువుదీరాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు గడువు ముగిసేవరకు పాలకమండలి ఉంటుంది. ఫిబ్రవరి 10 తర్వాతే కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ సిఫార్సుల కనుగుణంగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ వెలువరిస్తుంది. -
పీఠం.. కాసింత దూరం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్.. దాదాపు మూడింట ఒక వంతు ఫలితాన్ని మాత్రమే సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాన్ని సాధించ లేక పోయామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటిం చారు. గత నెల 17న గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రధాన రాజకీయ పక్షాలతో పోలిస్తే శరవేగంగా ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టినా ఫలితాల సాధనలో వెనుక బడటానికి దారితీసిన పరిస్థితులను టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. 2016లో సాధించిన ఫలితంతో పోలిస్తే పార్టీ గెలిచే డివిజన్ల సంఖ్య తగ్గుతుందని అంతర్గతంగా అంచనా వేయగా, ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అదే ఫలితాన్ని సూచించాయి. అయితే శుక్రవారం వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అంచనా కంటే తక్కువ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంపై ఆ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దుబ్బాక మొదలుకుని.. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన పక్షం రోజుల్లోనే గ్రేటర్ షెడ్యూల్ వెలువడటం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ నష్టానికి బాటలు వేసిందనే అభిప్రాయం ఆ పార్టీలో కన్పిస్తోంది. అభివృద్ది ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే టీఆర్ఎస్ వ్యూహానికి దుబ్బాక గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ అడ్డుకట్ట వేసిందనే భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎంతో టీఆర్ఎస్కు మితృత్వం ఉందంటూ బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ప్రజలకు మిగతా 2వ పేజీలో u వివరించలేకపోవడం వంటి కారణాలు టీఆర్ఎస్ను దెబ్బతీశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సంభవించిన వర్షాలు, వరదల మూలంగా నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధితులను అదుకునేందుకు రూ.10 వేల నగదు పంపిణీ లబ్ధిదారులు అందరికీ చేరకపోవడం, పంపిణీలో అవకతవకలు, వరద సాయం పంపిణీ అర్ధంతరంగా నిలిపేయడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రకటించిన ఉచిత తాగునీరు సరఫరా వంటి హామీలు కూడా ప్రభావితం చేయలేకపోయాయి. ఆస్తి పన్ను తగ్గింపు వంటి వరాలు కూడా ఓటర్లను ఆకట్టుకోలేక పోయాయి. పార్టీ యంత్రాంగాన్ని మోహరించినా.. మేయర్ పీఠాన్ని సొంతంగా గెలుచుకుంటామనే ధీమాతో గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలోనూ అభ్యర్థులను నిలబెట్టిన టీఆర్ఎస్.. 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ కనీసం 75 నుంచి 80 డివిజన్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్లు కలుపుకుని సుమారు 180 మందికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు గ్రేటర్ పరిధిలో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సారథ్యం వహించగా, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత నెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు బారులు తీరడంతో టీఆర్ఎస్ భారీ బలగాన్ని మోహరించి ఓటర్లను అకట్టుకోవాలనే వ్యూహం ఫలితం సాధించలేక పోయింది. -
గ్రేటర్ ఫలితాలపై నాయకుల స్పందన
ప్రజల తీర్పును శిరసావహిస్తాం.. ‘‘గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తీర్పును శిరసావ హిస్తాం. ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకొని ఓటమికి కారణాలను మదింపు చేసుకుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు ఇచ్చిన అలవిగాని వాగ్దానాలు, ప్రజలను భయాందోళనలకు గురి చేయడం, అడుగడుగునా అధికార దుర్వినియోగం వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపాయి..’’ - టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఓటమికి కారణాలు సమీక్షిస్తాం ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నాం. మా ఓటమికి గల కారణాలు సమీక్షిస్తాం. లోతుగా పరిశీలిస్తాం. ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధాకరం. ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడడానికి కృషి చేస్తాం..’’ - కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ఓటమిపై విశ్లేషిస్తాం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బాధాకరమే అయినా దాన్ని శిరసావహిస్తాం. టీఆర్ఎస్ కల్పించిన భ్రమలను, ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మినట్టుగా కనిపిస్తున్నది. ఈ ఓటమికి కారణాలను అంతర్గతంగా విశ్లేషించుకుంటాం. భవిష్యత్తులో పార్టీని నిర్మిస్తాం. - మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సవాల్‌పై కేటీఆరే వెనక్కి తగ్గారు.. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని పార్టీల అభ్యర్థులకు శుభాకాంక్షలు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. గ్రేటర్లో టీఆర్ఎస్ వందసీట్లు సాధిస్తే రాజకీయ సన్యాసం చేసే సవాల్‌పై మంత్రి కేటీఆరే వెనక్కి తగ్గారు..’’ - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ బాధ్యత పెరిగింది ‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాతీర్పు శిరోధార్యం. టీఆర్ఎస్ నాయకులు ఊహించిన దానికన్నా ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. టీఆర్ఎస్ బాధ్యత మరింత పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి..’’ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసించారు ‘‘మాటలు ఎక్కువగా చెప్పినా.. కరెంటు, నీరు విషయంలో సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గ్రాఫిక్స్ ప్రజలను ఆకర్షించాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కూడా వారికి లాభించింది. అందుకే టీఆర్ ఎస్ నాయకులు కూడా ఊహించని విధంగా జీహెచ్ఎంసీలో సీట్లు వచ్చాయి. ఈ విజయ గర్వంతో కళ్లు నెత్తిమీదకు ఎక్కించుకోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి..’’ - కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి ప్రజాతీర్పును గౌరవిస్తాం ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ప్రజల పక్షాన టీడీపీ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ కృషి చేయాలి..’’ - ట్విట్టర్లో నారా లోకేశ్ హామీల అమలుకోసం పోరాడుతాం ‘‘టీఆర్ఎస్కు మా అభినందనలు. వారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. జీహెచ్ఎంసీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం. హామీల అమలుకోసం ప్రజలతో కలసి సంఘటిత ఉద్యమాలను నిర్మిస్తాం..’’ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటాం ‘‘టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలును ప్రజలు విశ్వసించినట్టుగా ఈ తీర్పు కనబడుతోంది. డబుల్ బెడ్రూం సహా ఇతర హామీలను అమలు చేయాలంటూ క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాలను నిర్మిస్తాం. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకుంటాం..’’ - బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ ఇది ప్రభుత్వ విజయం: ఈటల సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం తమ ప్రభుత్వానిదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు పలికిన నగర ప్రజలకు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలన తీరుకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఈ అపూర్వ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. డిపాజిట్ గల్లంతైన విపక్షాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఊహించిన దానికంటే ఎక్కువే..: డీఎస్ సాక్షి, హైదరాబాద్: ఊహించిన దానికంటే ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని, కేసీఆర్ పాలన పట్ల, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు మద్దతుగా నిలిచారని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీఎస్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నగర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ‘‘ఇది స్పష్టమైన, వన్‌సైడ్ గెలుపు. ఏ పార్టీకీ గతంలో ఇవ్వని ఫలితం ఇది...’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. ‘ఈ విజయం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాననన్న మాటలను ప్రజలు నమ్మి సీఎంపై బాధ్యత పెట్టారు’ అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వివరించారు.