
నెల్లూరు (మినీ బైపాస్): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం ఫలితాల ద్వారా స్పష్టమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే ఈ నెల 7న నిరసన దీక్షలు నిర్వహిస్తామన్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment