ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగల రవాణా | red sandal in oil tanker | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగల రవాణా

Published Sun, Dec 17 2017 10:26 AM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM

red sandal in oil tanker

సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. వైఎస్సార్‌ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఆయిల్ ట్యాంకర్‌లో రవాణా అవుతున్న 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆయిల్ ట్యాంకర్‌లో దుంగలను నింపి రవాణా చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement