Siddavatam
-
ఒంటిమిట్ట రామయ్య హుండీ లెక్కింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆగస్టు నెలకు సంబంధించి నెల వారి హుండీ ఆదాయం రూ. 7 లక్షల 83 వేల 142 వచ్చినట్లు సోమవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగమండపంలో టీటీడీ సిబ్బంది ద్వారా హుండీలోని కానుకలను లెక్కించారు. నిత్యపూజ స్వామి ఆలయంలో.. సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్య పూజస్వామి హుండీ ఆదాయం రూ.1,76,803 వచ్చిందని ఆలయం ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖకు చెందిన కడప సూపర్వైజర్ ఎస్. జనార్దన్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లెక్కించామన్నారు. రూ. 1,76,803 నగదు, 191 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రెడ్డెమ్మకొండ ఆదాయం రూ. 7 లక్షలు గుర్రంకొండ : మండలంలోని సంతానదేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,00,121 ఆదాయం సమకూరింది. సోమవారం స్థానిక ఆలయంలో మదనపల్లె దేవదాయశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపంలో రూ. 7,00,121, బంగారు నగలు 20 గ్రాములు, వెండికానుకలు 489 గ్రాములు వచ్చినట్లు లెక్కతేల్చారు. హుండీ ఆదాయాన్ని గుర్రంకొండ గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈఓ మంజుల, ,సిబ్బంది పాల్గొన్నారు. -
జనసేన పీఏసీ చైర్మన్, నాయకులపై కేసు నమోదు
సిద్దవటం (కడప జిల్లా): కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్పై ఈ నెల 19న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోమర్ సమక్షంలో జరిగిన దాడికి సంబంధించి.. నాదెండ్ల మనోమర్ సహా తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తోపాటు నాగేంద్ర అనుచరులైన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 19న సిద్దవటంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేసి చొక్కా చింపి చెప్పుతో కొట్టి అవమాన పరిచారన్నారు. బా«ధితుడి ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్, తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం) -
చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..
ఇది పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం.. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు.. బిడ్డలతో పాటు గల్లంతయ్యాయి.. కన్నబిడ్డలపై కన్నవారు పెట్టుకున్న కోటి కలలు నీటిపాలయ్యాయి. సరదాగా ఇంటి నుంచి వెళ్లిన తమ గారాల బిడ్డ.. ఇక లేడు.. ఇక రాడని తెలిసిన క్షణం.. ఆ ఇంట తీరని పెను విషాదం నింపింది.. ఉన్నత చదువులు చదివించాలని.. ఉన్నతంగా చూసుకోవాలని.. మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు మరచిపోలేని చేదు నిజంగా మిగిలింది.. చెట్టంత కొడుకు.. శవమై పడిఉంటే.. తల్లిదండ్రులూ జీవచ్ఛవాలై కూలిపోయారు.. దేవుడా.. ఎందుకు మాకీ శిక్ష.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. దిక్కులేని వాళ్లమయ్యామంటూ.. గుండెలవిసేలా విలపించారు.. ఇది .. పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం.. సాక్షి, కడప: వారంతా ఒకేచోట కలిసి చదువుకున్నారు...మంచి స్నేహితులయ్యారు. తోటి మిత్రుడు శివకుమార్ తండ్రి రామచంద్రయ్య చనిపోతే వారంతా తల్లడిల్లిపోయారు... అందరూ కలిసి 150 కిలోమీరర్లు ప్రయాణించి ఆయన వర్ధంతి కార్యక్రమంలోనైనా పాల్గొందామని తిరుపతి వద్ద ఉన్న కొర్లగుంట నుంచి సిద్దవటం వచ్చారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పి రాగా, మరికొందరు చెప్పకుండానే వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సరదాగా పెన్నానదిలోకి దిగిన వారు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కలిసిమెలసి వచ్చిన ఏడుగురు స్నేహితులు మరణంలోనూ స్నేహాన్ని వీడలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకోగా అదేరోజు సాయంత్రానికి సోమశేఖర్, రాజేష్ మృతదేహాలు లభించాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు యశ్వంత్(16), సతీష్(18)ల మృతదేహాలు బయటపడగా, మధ్యాహ్నానికి షణ్ముగ శ్రీనివాస్(19), తరుణ్(17) మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం ఆరుగురి మృతదేహాలు లభించాయి. జగదీశ్వర్‌రెడ్డి(19) ఆచూకీ లభ్యం కాలేదు. వెలుతురు లేని కారణంగా శుక్రవారం సాయంత్రానికి గాలింపు చర్యలు నిలిపివేశారు. చదవండి: (వివాహేతర సంబంధం: నడిరోడ్డుపై భార్యను చంపేశాడు) ఒకే కుటుంబంలో ముగ్గురు పెన్నానదిలో గల్లంతై చనిపోయిన వారిలో సోమశేఖర్, యశ్వంత్ అన్నదమ్ములు కాగా, మరో మృతుడు షణ్ముగ శ్రీనివాస్(18) వారి అత్త కుమారుడు కావడం విశేషం. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. షణ్ముగ శ్రీనివాస్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఇతని తల్లి జి. మునిపార్వతి టీటీడీలో పనిచేస్తుండగా, తండ్రి చెంగల్రాయుడు కూలి పనులుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..) కుటుంబానికొక్కరు మృత్యువాత ►తిరుపతికి చెందిన పార్థసారధి, రుక్మిణి కుమారుడు చెన్నకోణం యశ్వంత్(16). మృతిచెందిన వారందరిలో చిన్నవాడు. సోమశేఖర్‌కు ఇతను తమ్ముడు. తిరుపతిలోని రాయలసీమ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ►మిగతా కుటుంబాల్లో ఇద్దరేసి కుమారులు ఉండగా వారిలో ఒకరు మృత్యువాత పడడం గమనార్హం. జి. మునిపార్వతి, చెంగల్రాయుడు దంపతులకు బాలాజీ, షణ్ముగ శ్రీనివాస్ ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్నవాడైన షణ్ముగ శ్రీనివాస్ మరణించాడు. ►తిరుపతి సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన కర్ణ సుబ్రమణ్యం మురళీ, దేవనాయకి దంపతులకు శ్రీనివాస్, సతీష్ అనే ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నకుమారుడైన తరుణ్ స్నేహితులతోపాటు వచ్చి మృత్యువాత పడ్డాడు. ►తిరుపతి ఆటోనగర్‌కు చెందిన శివకుమార్(ఆటోడ్రైవర్), సుహాసిని దంపతులకు సాయిశంకర్, తరుణ్ కుమారులు కాగా వారిలో చిన్నవాడైన తరుణ్ మృతిచెందిన వారిలో ఉన్నాడు. ►తిరుపతి సమీపంలోని కొర్లకుంటకు చెందిన బాలక్రిష్ణారెడ్డి(ఆటోడ్రైవర్), లక్ష్మిలకు కూడా ఇద్దరు కుమారులే. వీరిలో జగదీశ్వర్‌రెడ్డి (19) పెద్దవాడు. చిన్నవాడు వేణు దివ్యాంగుడు. జగదీశ్వర్‌రెడ్డి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీయట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని ఆచూకీ లభించాల్సి ఉంది. ఓఎస్డీ దేప్రసాద్, రాజంపేట సీసీఎస్ డీఎస్పీ ఎంపీ రంగనాయకులు, ఆర్ఐ సోమశేఖర్‌నాయక్, ఒంటిమిట్ట సీఐ హనుమంత నాయక్, రాజంపేట రూరల్ సీఐ వై. నరేంద్రరెడ్డి, ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు, సిద్దవటం ఎస్ఐ రమేష్‌బాబు మృతదేహాల వెలికితీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైఎస్ఆర్సీపీ సిద్దవటం ఇన్చార్జి మేడా మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు, గజ ఈతగాళ్లు, జాలర్లు రెండు బోట్లు, రెండు పడవలు, ట్యూబ్‌లు, వలలతో ఆచూకీ కోసం గాలించారు. ఆశలపై నీళ్లు రాజంపేట టౌన్ : గల్లంతయిన బిడ్డలను ఆ భగవంతుడు ఏదో రూపంలో కాపాడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. సిద్దవటం పెన్నానదిలో గురువారం ఏడుగురు యువకులు గల్లంతు కాగా వారిలో అదే రోజు సాయంత్రానికి ఇద్దరు విగతజీవులైన విషయం విధితమే. అయితే మిగిలిన ఐదురుగురి ప్రాణాలపై వారి తల్లిదండ్రులు అనేక ఆశలు పెట్టుకున్నారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు కొంతమంది అదే రోజు రాత్రికి సిద్దవటం చేరుకున్నారు. పోలీసులు వారికి ఆశ్రయం కల్పించారు. గజ ఈతగాళ్లు దొరికిన మృతదేహాలను ఒక్కొక్కటిగా ఒడ్డుకు చేర్చిన సమయంలో తల్లిదండ్రులు పరుగు పరుగున బిడ్డల మృతదేహాలపై పడి గుండెలు బాదుకొని రోదించసాగారు. మృతులంతా విద్యార్థులే పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారందరూ విద్యార్థులే. ఇందులో సోమశేఖర్, రాజేష్, సతీష్‌లు ఇటీవలే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరారు. అలాగే తరుణ్, షణ్ముఖ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, యశ్వంత్ ఇంటర్మీడియట్లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు. జగదీష్ డిగ్రీ చదువుతున్నాడు. అబద్ధంచెప్పి.. ఇంటి నుంచి వచ్చి మృతిచెందిన యువకులందరూ ఇళ్లలో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి శివకుమార్ తండ్రి రామచంద్ర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. నిజం చెప్పివుంటే తల్లిదండ్రులు మృతులను సిద్దవటం వెళ్లకుండా మందలించేవారు. ఫలితంగా అందరూ మృత్యుఒడికి దూరమయ్యే వారని పెన్నానదికి చేరుకున్న మృతుల్లోని కొంతమంది బంధువులు వాపోయారు. ఎవరికీ ఈత రాదు.. మృతి చెందిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఈతరాదు. నీళ్లు లోతుగా ఉన్న ప్రాంతం నుంచి విద్యార్థులు బయట పడలేక పోయారు. నీటి ప్రవాహం ఉధృతంగా లేనందున కొంత మాత్రం ఈత వచ్చి ఉన్నా ప్రాణాలతో బయటపడేవారు. అందరూ బెస్ట్‌ఫ్రెండ్స్ పెన్నా నదిలో గల్లంతై మృతి చెందిన వారందరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బెస్ట్‌ఫ్రెండ్స్ అని కొర్లగుంట వాసులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడి బతికిన శివకుమార్‌తో పాటు మృతి చెందిన ఆరుగురితో పాటు గల్లంతయిన జగదీష్ ఒకే వీధికి చెందిన వారు. కొంతమందికి వయస్సు రీత్యా తేడా ఉన్నప్పటికి మంచి స్నేహితుల్లా మెలిగేవారని గ్రామస్తులు చెప్పారు. తరలి వచ్చిన కొర్లగుంట యువత పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారి కోసం తిరుపతి సమీపంలోని కొర్లగుంటవీధికి చెందిన యువకులు గురువారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున సిద్దవటం తరలి వచ్చారు. వీరందరూ మృతులకు స్నేహితులు కావడం విశేషం. ఘటన గురించి తెలియగానే మనసు మనసులో లేక రాత్రికి రాత్రే సిద్దవటం చేరుకున్నట్లు వారు తెలిపారు. మృతి చెందిన ఏడుగురు తమకు స్నేహితులని, వారి మృతి తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చేదుజ్ఞాపకంలా మిగిలిపోతుందని పలువురు కంటతడి పెట్టారు. -
తీవ్ర విషాదం: పెన్నాలో ఏడుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ సంఘటన సిద్ధవటంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్, యశ్, జగదీశ్, సతీష్, చెన్ను, రాజేష్, తరుణ్ సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు. సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. -
ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. తెగిపడిన తలలు
ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. పెల్లుబుకిన ఆవేశాలు.. పౌరుషాలు...మార్మోగిన రణతూర్యాలు.. ప్రతిధ్వనించిన యుద్ధభేరీలు..ఎగిసిన ఖడ్గాలు...తెగిపడిన తలలు..విజయ నాదాలు...వీర సైనికుల రక్తపుటేర్లు, రాచరికపు జిత్తులు... రణతంత్రపుటెత్తులతో గొప్పగా విలసిల్లిన క్షేత్రం సిద్దవటం కోట. 18 రాజవంశాలు.. హిందూ, ముస్లిం పాలకుల కాలంలో చవిచూసిన వైభవానికి నిదర్శనంగా ఆ కోట నేటికీ పర్యాటకులను అలరిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దవటం కోట గురించి ప్రత్యేక కథనం సాక్షి, కడప : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్దవటం దక్షిణ ద్వారంగా పేరుగాంచింది. తూర్పు వాహినిగా ఉన్న పెన్నానదికి ఉత్తరాన చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోఉంది సిద్దవటం. బ్రిటీషర్ల హయాంలో సిద్దవటం జిల్లా కేంద్రంగా గొప్ప వైభవాన్ని చూసింది. పెన్నాలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగుల రాకపోకలకు తరుచూ అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారని తెలుస్తోంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వట (మర్రి) వృక్షాలు ఎక్కువగా ఉండేవని పెన్నాలో స్నానం చేసిన సిద్దులు ఆ చెట్ల కింద తపస్సు చేసుకునే వారని, అందుకే ఆ ఊరికి సిద్దవటం పేరు వచ్చిందని జనంలో ప్రచారంలో ఉంది. 18 రాజవంశాలు సిద్దవటాన్ని దాదాపు 18 రాజవంశాలు పాలించాయి. వీటిలో మట్లిరాజులు ముఖ్యపాత్ర పోషించారు. 12వ శతాబ్దం నుంచి వారి పాలన ఈ ప్రాంతంలో సాగిందని చరిత్రకారుల సమాచారం. తొలుత కాకతీయులు, తర్వాత విజయనగర మహారాజులకు మట్లిరాజులు సామంతులుగా ఉండేవారని కూడా తెలుస్తోంది. సిద్దవటం జిల్లాలోని అన్ని కోటల కంటే ప్రాచీనమైనదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. 11వ శతాబ్దానికి ముందే ఈ కోట నిర్మితమైందని, నాటి నందన చక్రవర్తి ఇక్కడ మట్టి కోటను నిర్మించాడని తెలుస్తోంది. తర్వాత తెలుగు చోళులు మట్టి కోటను ఇంకా పటిష్టం చేశారని, 14వ శతాబ్దంలో వచ్చిన మట్లిరాజులు (మట్లి అనంతరాజు) కోటను బలిష్టమైన రాతి కోటగా పునర్నిర్మించారని శాసనాధారాలతోపాటు కడప కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది. 1648లో మట్టిదేవ చోళ వెంకటరాజు నుంచి ఈ రాజ్యం ముస్లిం పాలకుడు మీర్‌జుమ్లా ఆధీనంలోకి వచ్చిందని, 1717లో ఆర్కాట్ నవాబుల వశమైందని, ఆర్కాట్ పాలకుడు పత్తేసింగ్ నుంచి కడప నవాబు నబీఖాన్, అతని నుంచి నిజాం నవాబు, 1800వ సంవత్సరం అక్టోబరు 12న నైజాం నవాబు నుంచి దీన్ని బ్రిటీషర్లు స్వాధీనం చేసుకున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. పాలనా క్రమం సిద్దవటం ప్రాంతాన్ని కలకడ వైదుంభులు కూడా పాలించినట్లు చారిత్రక సమాచారం. 1595 ప్రాంతంలో కొండ్రాజు తిరుపతిరాజు, వెంకటపతిరాజులకు రాజంపేట ఊటుకూరు వద్ద జరిగిన యుద్ధంలో మట్లిరాజులకు సిద్దవటం అమర నాయకంగా వచ్చింది. మట్లి వారి తర్వాత ఆర్కాట్ నవాబుల కాలంలో సిద్దవటం కోటను మైసూరు పాలకుడు హైదర్అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ పాలించాడు. మట్లి రాజులు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలను అభివృద్ధి చేసి సస్యశ్యామలంగా మార్చినట్లు సమాచారం. జిల్లాలోని కోటల్లో సగానికి పైగా మట్లిరాజులు నిర్మించినవే. వీరి ఏలుబడిలోని ప్రాంతాలను రాజువారి సీమగా పిలిచేవారు. వారి కాలంలోని అనంతరాజు బద్వేలు, యల్లమరాజు చిట్వేలి చెరువులను నిర్మించినట్లు తెలుస్తోంది. విశిష్ట స్థానం.. జిల్లాలోని కోటల్లో సిద్దవటానికి విశిష్ట స్థానం ఉంది. కోటకు దక్షిణం వైపున పెన్నానది సహజమైన, విశాలమైన కందకంగా ఉండగా, మిగతా మూడు వైపుల బలమైన రాతి గోడలు, బురుజులు ఉన్నాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మితమై ఉంది. కోట ముఖ ద్వారంలోనూ, లోపల సభా మండపం తదితర చోట్ల కనువిందు చేసే శిల్ప సోయగాన్ని తిలకించవచ్చు. కోటలో ప్రాచీన సిద్దేశ్వరస్వామి ఆలయం నేడు శిథిలమై ఉంది. గ్రామం మొదట్లో పెన్నా ఒడ్డున శ్రీ రంగనాయకస్వామి పురాతన ఆలయం ఉంది. కోటలో పలుచోట్ల శివాలయాలు బయల్పడుతున్నాయి. ఒకప్పుడు కోటలో పలు శివాలయాలు ఉండినట్లు దీని ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కోట కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. వారి ఆధ్వర్యంలో కోటలో ఆకర్షణ కోసం పచ్చిక బయళ్లు పెంచారు. కోట నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. పరిశోధకులు కోటలోని తెలుగు, కన్నడ, సంస్కృత శాసనాలను అధ్యయనం చేసేందుకు వస్తుంటారు. ఈ కోట హిందూ, ముస్లింల సమ్మిళత శైలికి నిదర్శనంగా కనిపిస్తుంది. కోటలో మసీదు కూడా ఉంది. 1802 ప్రాంతంలో ఈ కోటను సందర్శించిన బ్రిటీషు చిత్రకారుడు థామస్ ఫ్రీజర్ ఈ కోట గురించి రెండు అద్బుతమైన వర్ణ చిత్రాలు గీశారు. అవి నేటికీ లండన్ ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి. కళాపోషణ.. మట్లిరాజులు యుద్ద పిపాసులేగాక కళలకు కూడా పెద్దపీట వేశారు. మట్లి యల్లమరాజు కుమారుడు ఆనందరాజు ఆస్థానంలో నాటి ప్రముఖ కవి ఉప్పుగుండూరు వెంకట కవి ఉండేవారు. ఒంటిమిట్ట దశరథరామ చరిత్ర రాసింది ఆయనే. అనంతరాజు కూడా రాయలవారిలాగా మంచి కవి. ఆయన స్వయంగా కకుత్స విజయం కావ్యం రాశారు. కవి చౌడప్ప కూడా అనంతరాజు అస్థానంలోని వారే. రాయల కొలువులో లాగానే మట్లి అనంతరాజు కొలువులో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన రాజ్యపాలనలో రాయలంతటి పేరు గడించారు. ఒంటిమిట్ట ఆలయాన్ని పటిష్టం చేశారు. -
సీమకే తలమానికం లంకమల్ల అభయారణ్యం
సాక్షి, సిద్దవటం(కడప): సిద్దవటం రేంజిలోని లంకమల్ల అటవీ ప్రాంతం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. అత్యంత విలువైన అటవీ సంపద, ఆయుర్వేద వనమూలికలు, ప్రపంచంలోనే అంతరించిన కలివికోడికి, పులికి ఆవాస ప్రాంతంగా లంకమల్ల అభయారణ్యం వెలుగొందుతోంది. ప్రకృతి పరిచిన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఎతైన కొండలు భారీ వృక్షాల నడుమ ప్రయాణం, జలపాత సోయగాలు వర్ణనా తీతం. పవిత్రమైన క్షేత్రాలు నిత్యపూజస్వామి, లంకమల్లేశ్వర స్వామి, దట్టమైన అడవి కొండలు, జలపాతం, గుహలు మన రాయలసీమ ప్రాంత నేపథ్యంలో లంకమల్ల అడవుల ప్రాముఖ్యతగా చెప్పుకోవ చ్చు. సినిమాల్లో, కథల్లో, డిస్కవరి చానళ్లలో చూసే వింతలు, అద్భుతాలు నిజంగానే ఇక్కడే చూడవచ్చు. దట్టమైన అంకమల్ల అభయారణ్యంలో ప్రకృతి రమణీయతతో... కొండల పైనుంచి దూకే జలపాతం..కోనేరు, రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు అప్పుడప్పుడు తొంగి చూసే సూర్యకిరణాలు, చుట్టూ పర్వతాలు మధ్యలో సెలయేర్లు, జలపాతాలు ఎనిమిది దిక్కుల్లో నీటి గుండాలతో ప్రకృతి అందాలు ప్రశాంతతను కల్గిస్తాయి. అడుగు ఎత్తైన రాళ్ల మధ్య ప్రయాణం పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం, చాలా ఆహ్లాదకరంగా ట్రెక్కింగ్‌ను తలపిస్తుంది. చాతక పక్షి శ్రీశైలం దేవస్థానానికి దక్షిణ ద్వారంగా పిలువ బడే సిద్దవటం మండలంలో దట్టమైన లంకమల్ల అభయారణ్యం, ఎతైన గుహలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లంకమల్ల అభయారణ్యంలో దాదాపు మూడు నుంచి నాలుగు పులులు సంచరిస్తునట్లు అటవీ అధికారుల సమాచారం. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య నాలుగు సంవత్సరాల్లో 8 శాతం పెరిగినట్లు స్టేట్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2018లో నివేదికలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 48 పులులు ఉండగా కడప–కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో పులుల సంచారంపై ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉండగా వీటి పరిధిలో 15 రేంజిలు, ఐదు లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం అడవులను టైగర్ జోన్లుగా ప్రకటించారు. లంకమల్ల అభయారణ్యంలో 465 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా పులుల సంచారానికి అనుకూల ప్రదేశంగా ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి కలివికోడి ఆవాస ప్రాంతంగా ఉంది. కలివికోడి కోసం అన్వేషణ కలివి కోడి ఉనికి కోసం తొమ్మిది సార్లు విదేశీ కెమెరాలను ఏర్పాటు చేసినా జాడ గుర్తించలేకపోయారు. కనిపించని పక్షి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విమర్శల నుంచి బయట పడేందుకు అటవీ శాఖ అధికారులు లంకమల్లను టైగర్‌జోన్‌గా ప్రతిపాధించారనే విమర్శలూ లేకపోలేదు. టైగర్ కారిడార్ కోసం 7,410 హెక్టార్ల అటవీ భూభాగాన్ని కేటాయించారు. పులులకు అనుకూల ప్రదేశాలకు సిద్దవటం రేంజిలోని సిద్దవటం, అట్లూరు మండలాల పరిధిలో 27 అటవీ సరిహద్దు ప్రాంతాలు అనుకూలమని నివేదించారు. లంకమల్ల అభ్యయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లో పులులు సంచరించేందుకు పెన్నానది అడ్డంకిగా మరింది. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన కలివికోడి నాగార్జున సాగర్, శ్రీశైలంలో పులుల సంతతి బాగా పెరగడంతో పులులకు ఆవాస ప్రాంతాలను విస్తరించారు. అందులో భాగంగా లంకమల్లలో కూడా అటవీ శాఖ అధికారులు పులుల ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు. లంకమల్ల నుంచి శేషాచలానికి పులుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటునకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. లంకమల్ల నుంచి అహోబిలానికి , అహోబిలం నుంచి నల్లమల్ల అడువుల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం వరకు పులులు సంచరిస్తున్నట్లు సమాచారాన్ని సేకరించింది. లంకమల్లలో సంచరిస్తున్న పెద్దపులి సోమశిల వెనుక జలాలైన జంగాలపల్లె, వెలుగుపల్లె, అట్లూరు మండలంలోని చెండువాయి, ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు గ్రామాలను కూడా పరిశీలించి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ పులుల మార్గం ఏర్పాటునకు అయ్యే అంచనా ఖర్చులు, ఖాళీ చేయాల్సిన గ్రామాల వివరాలను ప్రభుత్వానికి వివరించింది. అలాగే లంకమల్లలో రోళ్లబోడు బీటు బేస్ క్యాంప్‌కు వెళ్లే 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా అటవీ సంపద వన్యమృగాల సంచారం చూపరులకు కనువిందు చేస్తాయి. ఎత్తై ప్రాంతాల్లో అటవీ శాఖ దాదాపు 16 లక్షల వ్యయంతో రెండు భవనాలు, తాగునీటి కోసం బోరు బేస్ క్యాంప్, సిబ్బందికి మౌలిక వసతులు కల్పించారు. -
మరో రెండు మృత దేహాలు లభ్యం
సిద్దవటం : పెన్నానదిలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయని ఒంటిమిట్ట సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి నదిలో అన్వేషించిన ఈతగాళ్లు ఏడు గంటలపాటు శ్రమించి రెండు మృతదేహాలను వెలికితీశారన్నారు. పెన్నానదిలో సరదాగా ఈత కోసం స్నేహితులతో కలిసి వచ్చిన కడప మృత్యుంజయకుంటకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతైన విషయం విదితమే. వీరిలో డేరంగుల లోకేష్(22) మృతదేహం ఆదివారం సాయంత్రమే వెలికితీయగా, మిగిలిన ఇద్దరు యువకులు బత్తల రవి(27) షేక్ ఫైరోజ్(18)మృతదేహాలను చీకటి పడటంతో వెలికితీయ లేకపోయామన్నారు. సోమవారం పోలీసులు ఆధ్వర్యంలో ఈతగాళ్లు వలలు వేసి వెదుకులాట ప్రారంభించారన్నారు. మొదట బత్తల రవి మృతదేహం లభ్యంకాగా, తర్వాత చాలా సేపటికి గానీ షేక్ ఫైరోజ్ మృతదేహం ఆచూకీ లభించలేదు. ఊబిలో కూరుకుపోయి ఉండటం వల్లే అతని మృతదేహం జాడ తెలియడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఎట్టకేలకు ఫైరోజ్ మృతదేహాన్ని 11.30 గంటల ప్రాంతంలో వెలికితీశారని చెప్పారు. విలపించిన కుటుంబ సభ్యులు తొలుత బత్తల రవి మృతదేహం బయట పడగానే ఆయన భార్య మౌనిక, కుటుంబీకులు బోరున విలపించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న రవికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది, వారికి 14 నెలల బాబు ఉన్నాడు. ఫైరోజ్ తల్లిదండ్రులు పెన్నానది వద్దనే చాలా సేపటి వరకూ మృత దేహం కోసం పడిగాపులు కాశారు. టైలరింగ్ పనిచేసే షేక్ దాదాపీర్, ఆఫ్తాబ్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా షేక్ ఫైరోజ్ చిన్నవాడు. ఇతను ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. ఫైరోజ్ మృతదేహం బయటపడగానే అతని తల్లిదండ్రులు, బంధువులు కంటతడి పెట్టారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బ్యాంకులో.. నగలు ఏమయ్యాయి?
సిద్దవటం : సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచ్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఖాతాదారులు, నగలను లాకర్లలో ఉంచిన వారు బెంబేలెత్తుతున్నారు. బ్యాంకులోనే భద్రత లేకపోతే ఎలా అని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే ఇటీవల సొసైటీ బ్యాంకుల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ఆయన పట్టించుకోక పోవడం గమనార్హం. మొన్న రాజంపేట, ఆ మొన్న అట్లూరు, నిన్న అలిరెడ్డిపల్లె, ఖాజీపేట అగ్రహారం, సిద్దవటం సహకార సొసైటీ బ్యాంకుల్లో నగదు, నగలు మాయం అయ్యాయి. సిద్దవటంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఉంది. దీని నుంచి రైతులు, సంఘ సభ్యులు రుణాలు తీసుకుంటున్నారు. అందులో కొందరు బంగారును తాకట్టు పెట్టి నగదును రుణంగా తీసుకున్నారు. 377.5 గ్రాముల బంగారు నగలు మాయం గతేడాది 34 మంది రైతులు తమ పంటల సాగు కోసం నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన పాటూరి విజయభాస్కరరెడ్డి 221 గ్రాముల బంగారును తాకట్టు పెట్టి రూ.3.28 లక్షలు, సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి సుబ్బమ్మ 28.5 గ్రాముల నగలు కుదువ పెట్టి రూ.40 వేలు, అదే మండలం పి.కొత్తపల్లెకు చెందిన రూపురెడ్డి ఎల్లారెడ్డి మొదటి సారి 62.5 గ్రాములకు రూ.95 వేలు, రెండో సారి 65.5 గ్రాముల నగలను తాకట్టుపెట్టి రూ.99 వేలు నగదును తీసుకున్నారు. ఇందులో ప్రతి నెల పాటూరి విజయభాస్కరరెడ్డి మాత్రమే రూ.3250 వడ్డీ చెల్లిస్తున్నారు. మిగతా వారు జూన్, జూలైలలో చెల్లించి నగలు తీసుకోవడమో, రెన్యూవల్ చేయడమో చేద్దామని అనుకున్నారు. ఇంతలోనే అధికారులు ఆ నగలపై కన్ను వేశారు. ఈ నెల 17న బయపడిన వ్యవహారం ఈ నెల 7న బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బదిలీపై రాజంపేట బ్రాంచ్‌కి వెళ్లారు. ఆ తరువాత ఈ నెల 17న నగల లాకర్‌ను బ్యాంకు మేనేజర్ రవిచంద్రరాజు అనుమానం వచ్చి పరిశీలించారు. 34 మంది ఖాతాదారుల నగలు రికార్డు ప్రకారం ఉండాలి. అయితే అందులో నలుగురికి చెందిన నగల సంచులు కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అధికారులను సమావేశ పరచి చర్చించారు. వారు ఎలాంటి సమాచారం తెలపలేదు. బ్రాంచ్ మేనేజర్ జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. జిల్లా కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ వచ్చి సీసీ కెమరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశారు. అయితే నగల మాయంపై బ్యాంకర్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం రవాణా
-
ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగల రవాణా
సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఆయిల్ ట్యాంకర్లో రవాణా అవుతున్న 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆయిల్ ట్యాంకర్లో దుంగలను నింపి రవాణా చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
సిద్దవటం: సిద్దవటంలోని జేఎంజే కళాశాల సమీపంలో సోమవారం పెట్రోలు ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలియం డిపో నుంచి ఏపీ 02 ఎక్స్ 4500 అనే నంబర్ గల ఆయిల ట్యాంకర్ పెట్రోలు నింపుకొని కర్నూలులోని పోలీసు వారి పెట్రోలు బంకుకు తీసుకెళ్తోంది. భాకరాపేట–కడప మార్గం మధ్యలో పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ముల వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని కంట్రోలు చేయలేక పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లో ఉన్న పెట్రోలు కింద పడి పోయింది. సమాచారం తెలుసుకున్న హెచ్‌పీసీఎల్ సిబ్బంది కడప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేలపై పడిన పెట్రోలుపై నీరు చల్లారు. తరువాత ఈ ట్యాంకర్ నుంచి పెట్రోలును వేరే ట్యాంకర్‌లోకి బకెట్లతో పోశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కడపకు చెందిన కె.ఈశ్వరయ్య, క్లీనర్ గుంతకల్లుకు చెందిన చాకలి సాయినాథ్ లకు స్వల్ప గాయాలయ్యాయి. -
ముగ్గురు తమిళ కూలీల అరెస్ట్
సిద్దవటం : ఎర్రచందనం అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు తమిళ కూలీలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజిలోని రోళ్లబోడు బీటులో నరుకుడు బండ అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం తిరుణామలైకి చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి అక్రమాలకు పాల్పడుతుండగా ఎస్ఐ అనిల్‌కుమార్, పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా వి.విలియమ్సెట్, విలియం రాజ్‌కుమార్, గోవిందన్రామలింగం అనే ముగ్గురు కూలీలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. -
ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి
అట్లూరు: మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అటవీ చెక్‌పోస్టు సమీపాన గురువారం ఉదయం ట్రాక్టరుపై నుంచి కింద పడి మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టరు వరిగడ్డి కోసం సిద్దవటం మండలానికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన ముమ్మనబోయిన సుబ్బరత్నమ్మ(40) ట్రాక్టర్ ఎక్కింది. అట్లూరు మండలం అటవీ చెక్‌పోస్టు సమీపానికి చేరుకునే సమయానికి ట్రాక్టరు వేగంగా వెళుతుండడంతో ట్రాక్టరుపై నుంచి సుబ్బరత్నమ్మ కింద పడింది. వెంటనే అదే ట్రాక్టరులో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. ఈమేరకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
సిద్ధవటం: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం వాసవీ ఫార్మసీ కళాశాల వద్ద కడప- చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ముక్కా సుదర్శన్‌రెడ్డి (65)తోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయిపోయింది. -
వ్యక్తి మరణానికి కారణమైన ఆటోడ్రైవర్‌కు జైలు
సిద్ధవటం (వైఎస్సార్ జిల్లా) : రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఆటో డ్రైవర్‌కు వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మేజిస్ట్రేట్ ఆరు నెలల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2014 అక్టోబర్ 11న ఆటో బోల్తా పడడంతో రాంచంద్రరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగానే అతను మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిగా ఆటో డ్రైవర్ ఐవారెడ్డిని పేర్కొంటూ అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి విచారణ అనంతరం ఆరోపణలు రుజువు కావడంతో ఆటో డ్రైవర్ ఐవారెడ్డికి శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ సోమవారం తీర్పు చెప్పారు. -
ఆర్ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు
వైఎస్సార్ (సిద్ధవటం) : వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలోని 11వ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణపై శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదయింది. తన భర్త వెంకటరమణ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య విష్ణుప్రియ సిద్ధవటం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటరమణతో పాటు అత్త, బావలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.