
సిద్దవటం (కడప జిల్లా): కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్‌పై ఈ నెల 19న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోమర్ సమక్షంలో జరిగిన దాడికి సంబంధించి.. నాదెండ్ల మనోమర్ సహా తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తోపాటు నాగేంద్ర అనుచరులైన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు.
ఈనెల 19న సిద్దవటంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేసి చొక్కా చింపి చెప్పుతో కొట్టి అవమాన పరిచారన్నారు. బా«ధితుడి ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్, తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం)
Comments
Please login to add a commentAdd a comment