ఆయిల్ ట్యాంకర్ బోల్తా
Published Mon, Apr 3 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
సిద్దవటం: సిద్దవటంలోని జేఎంజే కళాశాల సమీపంలో సోమవారం పెట్రోలు ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలియం డిపో నుంచి ఏపీ 02 ఎక్స్ 4500 అనే నంబర్ గల ఆయిల ట్యాంకర్ పెట్రోలు నింపుకొని కర్నూలులోని పోలీసు వారి పెట్రోలు బంకుకు తీసుకెళ్తోంది. భాకరాపేట–కడప మార్గం మధ్యలో పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ముల వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని కంట్రోలు చేయలేక పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పెట్రోలు కింద పడి పోయింది. సమాచారం తెలుసుకున్న హెచ్‌పీసీఎల్ సిబ్బంది కడప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేలపై పడిన పెట్రోలుపై నీరు చల్లారు. తరువాత ఈ ట్యాంకర్ నుంచి పెట్రోలును వేరే ట్యాంకర్‌లోకి బకెట్లతో పోశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కడపకు చెందిన కె.ఈశ్వరయ్య, క్లీనర్ గుంతకల్లుకు చెందిన చాకలి సాయినాథ్ లకు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement
Advertisement