వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలోని 11వ బెటాలియన్‌లో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణపై శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదయింది.
వైఎస్సార్ (సిద్ధవటం) : వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలోని 11వ బెటాలియన్‌లో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణపై శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదయింది. తన భర్త వెంకటరమణ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య విష్ణుప్రియ సిద్ధవటం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటరమణతో పాటు అత్త, బావలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.