rsi
-
HYD: గన్‌తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్ నాగర్ కర్నూల్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది. వివరాల ప్రకారం.. అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆదివారం ఉదయం తన సర్వీర్ రివాల్వర్‌తో తనను తానే కాల్చుకుని బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. బాలేశ్వర్ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు. -
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌లో ప్రేమ.. నెల్లూరుకు వచ్చి వెళ్తూ..
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట వంచించాడని ఆర్ఎస్ఐపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు రహస్య విచారణ సాగిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జిల్లాలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతను ఇంజినీరింగ్ చదివే సమయంలో హైదరాబాద్‌కు చెందిన సహచర విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇంజినీరింగ్ పూర్తయిన అనంతరం ఉద్యోగ నిమిత్తం అతను హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసుశాఖలో ఆర్ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. నెల్లూరులో విధులు నిర్వహిస్తూ ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. తరచూ ఆ యువతి నెల్లూరుకు వచ్చి వెళ్లేది. గత కొంతకాలంగా ఆమెను దూరంగా పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన యువతిపై చేయిచేసుకోవడంతో ఆమె డయల్ 100కు కాల్ చేసింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సదరు అధికారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించగా ప్రేమ పేరిట వంచించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్గామిట్ట పోలీసులు రెండు రోజులుగా గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సదరు అధికారి వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఆర్ఎస్ఐగా విధుల్లో చేరిన కొత్తలో ఓ యువతి ఇతని వ్యవహార శైలిపై అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తీవ్రస్థాయిలో అతన్ని వారు మందలించారని సమాచారం. చదవండి: (డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?) -
పెంబర్తి వద్ద బొలెరో బోల్తా.. ఎస్ఐ మృతి
సాక్షి, జనగామ: వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కర్ణుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జనగామ జిల్లా పెంబర్తి శివారు వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డిపార్ట్మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి) -
ఇద్దరు ఆర్ఐలు తెలంగాణకు బదిలీ
కర్నూలు : ఏపీఎస్పీ రెండవ పటాలంలో పనిచేస్తున్న ఆర్ఐలు ఏడుకొండలు, భిక్షపతి తెలంగాణకు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజనలో భాగంగా వారిని తెలంగాణకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై వెళ్తున్న వీరిని కమాండెంట్ శామ్యూల్ జాన్ మంగళవారం సత్కరించారు. 2012 ఫిబ్రవరి 14నుంచి వారు రెండవ పటాలంలో సేవలందించారు. జనవరి 31వ తేదీన పదవీ విరమణ పొందిన ఆర్ఐ వెంకటరామ్‌ను కూడా ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ అల్లా బకాష్ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శశికాంత్, ఎస్.ఎం.బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు యుగేంధర్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. -
పరిధి దాటి పట్టుబడి..
పెద్దనోట్ల పట్టివేత కేసులో ఆర్ ఎస్సై చేతివాటం ఎస్సై పోస్టుకు ఎసరు తెచ్చుకున్న కానిస్టేబుల్ కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వేగేటు సమీపంలో పెద్దనోట్ల అక్రమ రవాణా పట్టివేత వ్యవహారంపై తవ్వేకొద్దీ పలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నగదు పట్టివేత, పోలీస్ స్టేషన్ అప్పగింత విషయంలో ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. పెద్దనోట్ల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే కాకినాడ సబ్ డివిజినల్ అధికారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన అనుమతి తీసుకున్నాక, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే తనిఖీలు చేపట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా సర్వం తానై పెద్దనోట్ల పట్టివేతలో అక్రమానికి సదరు అధికారి తెరలేపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆర్ఎస్సై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లకుండా కేవలం కానిస్టేబుళ్లను పంపి తాను పక్కకు తప్పుకోవడం పోలీసు వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో రిజర్వు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, నాలుగు నెలలుగా కాకినాడ ఒకటో పట్టణ సార్జెంట్ ట్రాఫిక్ ఎస్సైగా చేరి పెద్దనోట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్ప డటంతో జిల్లా ఎస్పీ వీఆర్‌లో ఉంచారు. కొవ్వాడ కేసులో పెద్దనోట్ల అక్రమ రవాణాలో పట్టుబడ్డ నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని, విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రిలిమినరీ ఎస్సై పరీక్షకు క్వాలిఫై.. ఇటీవల జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష (సివిల్ ఎస్సై) పోస్టుకు అర్హత సాధించిన ఓ కానిస్టేబుల్ పెద్దనోట్ల అక్రమ వ్యవహారంలో తలదూర్చి అడ్డంగా దొరికిపోవడంతో ఇతని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిసెంబర్ 4వ తేదీన కొవ్వాడలో నగదు తనిఖీల్లో అక్రమాలకు పాల్పడి వీఆర్‌లోకి వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లలో ఒకరైన (గంగాధర్) ఒకటో పట్టణ ట్రాఫిక్ పోలీసుస్టేçÙన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీ దిగి, ఇంటికెళ్లిపోతున్న క్రమంలో ఆర్ఎస్సై తనిఖీలకు రావాలంటూ ఆదేశాలివ్వడంతో, కొవ్వాడ వెళ్లి ఈ కేసులో ఇరుక్కున్నట్టు పలువురు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. -
ఆ భారీ మొత్తం వెనుక పెద్దలెవరు?
కొవ్వాడ వద్ద నోట్ల పట్టివేత వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వీఆర్‌లోకి ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వే గేటు సమీపంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్దనోట్ల పట్టివేత వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెద్దనోట్లను కాకినాడకు చెందిన ఓ వైద్యుని ఇంటికి తరలిస్తున్నట్లు వెల్లడికావడంతో తరలిస్తు్తన్న వ్యక్తుల నుంచి పోలీసులు బేరసారాలకు దిగి రూ. 5 లక్షలు లంచం తీసుకుని,అసలైన నిందితులను విడిచిపెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమపర్వానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 4న రాత్రి కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం–పైన రహదార్లో వాహనాల తనిఖీ చేపట్టారు. మాచవరం నుంచి కాకినాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్ద నోట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెద్దనోట్ల నగదు పట్టివేత, స్వాధీనంపై పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ నగదు స్వాధీనంపై సోమ, మంగళవారాల్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు అలా చేయకపోవడం ఆరోపణలకు ఊతమిచ్చింది. నగదు పట్టివేత, కేసు నమోదులో పోలీసుల వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. అక్రమ నగదు పట్టివేతపై పోలీసులపై ఆరోపణలు రావడాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోట్ల పట్టివేత వ్యవహారంలో సిబ్బంది సొమ్ములకు ఆశపడి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్, ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, ప్రసాద్, పరశురాంరెడ్డిలను వీఆర్‌లోకి పంపుతూ ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వీరిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న పెద్దనోట్లను ఎవరి దగ్గరకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు, ఎంత మంది అక్రమ రవాణాలో పాల్గొన్నారన్నది తెలుసుకుని, పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు
వైఎస్సార్ (సిద్ధవటం) : వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలోని 11వ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణపై శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదయింది. తన భర్త వెంకటరమణ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య విష్ణుప్రియ సిద్ధవటం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటరమణతో పాటు అత్త, బావలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.