పరిధి దాటి పట్టుబడి..
Published Fri, Dec 9 2016 11:43 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
పెద్దనోట్ల పట్టివేత కేసులో ఆర్ ఎస్సై చేతివాటం
ఎస్సై పోస్టుకు ఎసరు తెచ్చుకున్న కానిస్టేబుల్
కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వేగేటు సమీపంలో పెద్దనోట్ల అక్రమ రవాణా పట్టివేత వ్యవహారంపై తవ్వేకొద్దీ పలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నగదు పట్టివేత, పోలీస్ స్టేషన్ అప్పగింత విషయంలో ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్‌ఎస్సై శంకరప్రసాద్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. పెద్దనోట్ల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే కాకినాడ సబ్ డివిజినల్ అధికారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన అనుమతి తీసుకున్నాక, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే తనిఖీలు చేపట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా సర్వం తానై పెద్దనోట్ల పట్టివేతలో అక్రమానికి సదరు అధికారి తెరలేపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆర్‌ఎస్సై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లకుండా కేవలం కానిస్టేబుళ్లను పంపి తాను పక్కకు తప్పుకోవడం పోలీసు వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో రిజర్వు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, నాలుగు నెలలుగా కాకినాడ ఒకటో పట్టణ సార్జెంట్ ట్రాఫిక్ ఎస్సైగా చేరి పెద్దనోట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్ప డటంతో జిల్లా ఎస్పీ వీఆర్‌లో ఉంచారు. కొవ్వాడ కేసులో పెద్దనోట్ల అక్రమ రవాణాలో పట్టుబడ్డ నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు.
ప్రిలిమినరీ ఎస్సై పరీక్షకు క్వాలిఫై..
ఇటీవల జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష (సివిల్ ఎస్సై) పోస్టుకు అర్హత సాధించిన ఓ కానిస్టేబుల్ పెద్దనోట్ల అక్రమ వ్యవహారంలో తలదూర్చి అడ్డంగా దొరికిపోవడంతో ఇతని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిసెంబర్ 4వ తేదీన కొవ్వాడలో నగదు తనిఖీల్లో అక్రమాలకు పాల్పడి వీఆర్‌లోకి వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లలో ఒకరైన (గంగాధర్) ఒకటో పట్టణ ట్రాఫిక్ పోలీసుస్టేçÙన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీ దిగి, ఇంటికెళ్లిపోతున్న క్రమంలో ఆర్‌ఎస్సై తనిఖీలకు రావాలంటూ ఆదేశాలివ్వడంతో, కొవ్వాడ వెళ్లి ఈ కేసులో ఇరుక్కున్నట్టు పలువురు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement