ఇద్దరు ఆర్‌ఐలు తెలంగాణకు బదిలీ
Published Wed, Mar 8 2017 12:53 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM
కర్నూలు : ఏపీఎస్పీ రెండవ పటాలంలో పనిచేస్తున్న ఆర్‌ఐలు ఏడుకొండలు, భిక్షపతి తెలంగాణకు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజనలో భాగంగా వారిని తెలంగాణకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై వెళ్తున్న వీరిని కమాండెంట్ శామ్యూల్ జాన్ మంగళవారం సత్కరించారు. 2012 ఫిబ్రవరి 14నుంచి వారు రెండవ పటాలంలో సేవలందించారు. జనవరి 31వ తేదీన పదవీ విరమణ పొందిన ఆర్‌ఐ వెంకటరామ్‌ను కూడా ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ అల్లా బకాష్ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శశికాంత్, ఎస్.ఎం.బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు యుగేంధర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement