సిద్దవటం : ఎర్రచందనం అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు తమిళ కూలీలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామని ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజిలోని రోళ్లబోడు బీటులో నరుకుడు బండ అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం తిరుణామలైకి చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి అక్రమాలకు పాల్పడుతుండగా ఎస్‌ఐ అనిల్‌కుమార్, పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా వి.విలియమ్‌సెట్, విలియం రాజ్‌కుమార్, గోవిందన్‌రామలింగం అనే ముగ్గురు కూలీలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.