భారత క్రికెట్‌కు ‘బ్యాడ్‌ సండే’ | three of India's national cricket teams faced defeats on Sunday | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌కు ‘బ్యాడ్‌ సండే’

Published Mon, Dec 9 2024 7:33 AM | Last Updated on Mon, Dec 9 2024 7:45 AM

three of India's national cricket teams faced defeats on Sunday

ఒకే రోజు మూడు వేర్వేరు మ్యాచ్‌ల్లో భారత జట్లకు ఓటమి

డే నైట్‌ టెస్టులో 10 వికెట్లతో రోహిత్‌ బృందం పరాజయం

రెండో వన్డేలోనూ ఓడిపోయిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు

జూనియర్‌ ఆసియా కప్‌ ఫైనల్లో యువ భారత్‌కు షాక్‌ 

క్రికెట్‌ మైదానంలో ఆదివారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు! ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ రెండో టెస్టులో రోహిత్‌ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు ఆ్రస్టేలియా చేతిలో పరాజయం చవిచూడగా... ఆస్ట్రేలియాలోని మరో వేదిక బ్రిస్బేన్‌లో భారత మహిళల జట్టుకూ భారీ ఓటమి ఎదురైంది. అడిలైడ్‌ ‘పింక్‌ బాల్‌’ టెస్టులో పురుషుల జట్టు ప్రభావం చూపలేకపోగా... రెండో వన్డేలో ఓడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని మహిళల జట్టు కంగారూలకు సిరీస్‌ కోల్పోయింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్‌ కప్‌ అండర్‌–19 టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు తుదిపోరులో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడి టైటిల్‌కు దూరమైంది. మొత్తానికి ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాల్లో భారత క్రికెట్‌ జట్లను పరాజయం పలకరించడంతో ‘హ్యాపీ సండే’ కావాల్సిన చోట ‘బ్యాడ్‌ సండే’గా మారింది.

అడిలైడ్‌లో అదే వ్యథ
అడిలైడ్‌: గులాబీ బంతి పరీక్షలో భారత జట్టు గట్టెక్కలేదు. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో జరిగిన ‘పింక్‌ బాల్‌’ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు మరోసారి అడిలైడ్‌ వేదికగా ఓటమి వైపు నిలిచింది. ఆదివారం ముగిసిన ‘డే అండ్‌ నైట్‌’ టెస్టులో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆ్రస్టేలియా... తమకు అచ్చొచి్చన ‘పింక్‌ బాల్‌’ టెస్టులో ఘనవిజయంతో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ‘ని 1–1తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 128/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా... 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. 

ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి భారత టాప్‌ స్కోరర్‌గా నిలవగా... మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కెపె్టన్‌ కమిన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా... బోలండ్‌ 3 వికెట్లు, స్టార్క్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మెక్‌స్వీనీ (10 నాటౌట్‌), ఖ్వాజా (9 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్‌ హెడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది.  

మరో 47 పరగులే జోడించి... 
ప్రధాన ఆటగాళ్లు రెండో రోజే అవుటైనా... రిషబ్‌ పంత్‌ (28), నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజులో ఉండటంతో... భారత అభిమానులు అడిలైడ్‌లో అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తే... అది అడియాశే అయింది. క్రితం రోజు స్కోరు వద్దే పంత్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే పరాజయం ఖాయమైపోగా... నితీశ్‌ రెడ్డి దూకుడు పెంచి జట్టుకు ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించాడు. ఈ ఆంధ్ర కుర్రాడు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తర్వాత 9వ వికెట్‌ రూపంలో అవుటయ్యాడు. తాజా సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు భారత్‌ తరఫున నితీశ్‌ రెడ్డి టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం. అశి్వన్‌ (7), హర్షిత్‌ రాణా (0), సిరాజ్‌ (7) ఇలా ఒకరివెంట ఒకరు పెవిలియన్‌ చేరిపోవడంతో టీమిండియా ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రోహిత్‌ బృందం క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత జట్టు కేవలం 81 ఓవర్లు మాత్రమే ఆడింది.  
స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 180; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 337; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) కేరీ (బి) బోలండ్‌ 24; రాహుల్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 7; గిల్‌ (బి) స్టార్క్‌ 28; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్‌ 11; పంత్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 28; రోహిత్‌ (బి) కమిన్స్‌ 6; నితీశ్‌ రెడ్డి (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్‌ 42; అశి్వన్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 7; హర్షిత్‌ (సి) ఖ్వాజా (బి) కమిన్స్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 2; సిరాజ్‌ (సి) హెడ్‌ (బి) బోలండ్‌ 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్‌) 175. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, 6–128, 7–148, 8–153, 9–166, 10–175. బౌలింగ్‌: స్టార్క్‌ 14–1–60–2; కమిన్స్‌ 14–0–57–5; బోలండ్‌ 8.5–0–51–3. 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: మెక్‌స్వీనీ (నాటౌట్‌) 10; ఖ్వాజా (నాటౌట్‌) 9; మొత్తం (3.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 19. బౌలింగ్‌: బుమ్రా 1–0–2–0; సిరాజ్‌ 1.2–0–9–0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1–0–8–0.

12 ఇప్పటి వరకు 13 డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 12 టెస్టుల్లో నెగ్గడం విశేషం. అడిలైడ్‌లో ఆడిన 8 డే నైట్‌ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియా గెలిచి అజేయంగా ఉంది.  మరోవైపు ఇప్పటి వరకు ఐదు డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండూ అడిలైడ్‌లోనే కావడం గమనార్హం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement