
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు. మూడు దశాబ్దాల తరువాత ఆసిస్ జట్టును మట్టికరపించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెటర్లను యంగ్ ఇండియా అంటూ అభివర్ణించారు నీతా అంబానీ. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా)
‘‘ఇంతటి చారిత్రాత్మక విజయానికి భారత జట్టుకు అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం, సంకల్పం, నిర్భీతితో ఈ అద్భుతమైన సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఇదీ మన యంగ్ ఇండియా, న్యూ ఇండియా. దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేసిన మీ విజయానికి, ధైర్యానికి ఒక భారతీయురాలిగా గర్వపడుతున్నాను అంటూ నీతా అంబానీ తన అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా బ్రిస్బేన్‌లోని గబ్బాలో యువ భారత జట్టు ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై అటు క్రికెట్ లెజెండ్స్, ఇతర క్రీడాభిమానులతోపాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. (పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది)
Comments
Please login to add a commentAdd a comment