
టీమిండియా రైజింగ్ స్టార్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై తిరుమల దర్శనానికి వెళ్లాడు. నితీశ్ ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన విషయాన్ని నితీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నితీశ్ మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC
— Pari (@BluntIndianGal) January 13, 2025
కాగా, నితీశ్ ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ భారత్ తరఫు రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ సాధించి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సెంచరీతో నితీశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్.. ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో నితీశ్ ఐదు టెస్ట్‌ల్లో 37.25 సగటున 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.
బీజీటీతో భారత్‌కు నితీశ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ లభించాడు. ఈ సిరీస్‌లో నితీశ్ రాణించినా భారత్ 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. బీజీటీ అనంతరం భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. నితీశ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే భారత్ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగనుంది. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు గ్రూప్-ఏలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 19న ప్రకటించే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)
ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దృవ్ జురెల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్
భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)
మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)
Comments
Please login to add a commentAdd a comment