వ్యక్తి మరణానికి కారణమైన ఆటోడ్రైవర్‌కు జైలు | Auto driver jailed for causing death of One | Sakshi
Sakshi News home page

వ్యక్తి మరణానికి కారణమైన ఆటోడ్రైవర్‌కు జైలు

Published Mon, Jan 18 2016 6:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Auto driver jailed for causing death of One

సిద్ధవటం (వైఎస్సార్ జిల్లా) : రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఆటో డ్రైవర్‌కు వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మేజిస్ట్రేట్ ఆరు నెలల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2014 అక్టోబర్ 11న ఆటో బోల్తా పడడంతో రాంచంద్రరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగానే అతను మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిగా ఆటో డ్రైవర్ ఐవారెడ్డిని పేర్కొంటూ అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి విచారణ అనంతరం ఆరోపణలు రుజువు కావడంతో ఆటో డ్రైవర్ ఐవారెడ్డికి శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ సోమవారం తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement