సిద్ధవటం: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం వాసవీ ఫార్మసీ కళాశాల వద్ద కడప- చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముక్కా సుదర్శన్‌రెడ్డి (65)తోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయిపోయింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Published Sat, May 7 2016 11:41 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement