ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి | Died woman lying in tractor | Sakshi
Sakshi News home page

ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి

Published Fri, Nov 4 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి

ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి

అట్లూరు: మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అటవీ చెక్‌పోస్టు సమీపాన గురువారం ఉదయం ట్రాక్టరుపై నుంచి కింద పడి మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు.  బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టరు వరిగడ్డి కోసం సిద్దవటం మండలానికి వెళుతుండగా  అదే గ్రామానికి చెందిన ముమ్మనబోయిన సుబ్బరత్నమ్మ(40) ట్రాక్టర్‌ ఎక్కింది.  అట్లూరు మండలం అటవీ చెక్‌పోస్టు సమీపానికి చేరుకునే సమయానికి ట్రాక్టరు వేగంగా వెళుతుండడంతో ట్రాక్టరుపై నుంచి సుబ్బరత్నమ్మ కింద పడింది. వెంటనే అదే ట్రాక్టరులో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. ఈమేరకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement