వరంగల్: వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా హంటర్‌రోడ్‌లో జరిగింది. శ్రీలక్ష్మి దుర్గ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఈ రోజు ఉదయం వరంగల్ వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేసీబీల సాయంతో దాన్ని రోడ్డు మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆయిల్‌ట్యాంకర్
Published Sat, Oct 3 2015 11:11 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement