అనకాపల్లి (విశాఖపట్నం) : ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయిల్ ట్యాంకర్‌లో తరలిస్తున్న 950 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మన్యం నుంచి మహానగరానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.