
అనకాపల్లి: కూటమి పాలనలో రైతుల కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక వాటికి వారే స్వయంగా నిప్పుపెట్టుకునే పరిస్థితులు రావడంతో కూటమి పాలన ఎలా ఉందో చెప్పడానికి అద్దం పడుతోంది. తాజాగా ఓ రైతు పండించిన చెరుకుకు మంట పెట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు.. ఎకరా చెరుకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నాడు. పండించిన చెరుకును సాగు చేద్దామంటే గిట్టబాటు కాదు.. అదే సమయంలో ప్రభుత్వం గిట్టుబాట ధర కూడా లేదు. ఇంకెమీ చేసేది లేక చెరుకు పంటను మంట పెట్టాడు.
‘పండించిన చెరుకు గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీకి చెరుకు పంపిన పేమెంట్లు ఇవ్వడం లేదు. నెలల సంవత్సరాల తరబడి పేమెంట్లను అందడం లేదు. చెరుకును ఫ్యాక్టరీకి చెరుకు పంపిన ఎప్పుడు క్రస్సింగ్ జరుగుతుందో తెలీదు. గిట్టుబాటు ధర లేక చెరుకు పంటకు నిప్పు అంటించాను. గతంలో 15 రోజులకు పేమెంటు ఇచ్చేవారు’ అని రొంగలి వెంకటరావు చెప్పుకొచ్చాడు.
ఇది ఒక్కరి గాథే కాదు..
ఇది ఒక్క రొంగలి వెంకటరావు పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. అటు మిర్చి పంటల దగ్గర్నుంచీ చెరుకు పంట వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రైతులకు తాము ఉన్నామనే భరోసా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం హామీలకు పరిమితమైన కూటమి సర్కారు.. రైతుల గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు.

గతంలో వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయం అనేది పండుగలా సాగింది. ‘రైతు భరోసా’ తో రైతుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ జగన్ అటు రైతుకే కాదు.. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన నాయకుడు వైఎస్ జగన్. ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత ‘వైఎస్ జగన్ పాలనే ఉండి ఉంటే బాగుండేది’ అనే మాట.. ప్రతీ నోట వినిపిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు వైఎస్ జగన్. ఇక్కడ పార్టీలను అస్సలు పట్టించుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ ముందుకెళితే.. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది.
ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. మరొకవైపు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన సభలో ఏమన్నారో అందరికీ తెలుసు. వైఎస్సార్‌సీపీ వారైతే సంక్షేమం ఇవ్వొద్దనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రకటించారు. వైఎస్సార్ సీపీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు. ఏ స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుందని అంటూ అధికారులను అప్రమత్తం చేశాడు. మరి అటువంటప్పుడు రైతుల కన్నీటి గాథలే ఉంటాయి తప్పితే వారికి గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment