ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న వోల్వో బస్సు | one die as Volvo Bus hits oil tanker in guntur district | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న వోల్వో బస్సు

Published Fri, Sep 12 2014 8:17 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

one die as Volvo Bus hits oil tanker in guntur district

గుంటూరు : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండం అన్నవరప్పాడు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఒక ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కొండేపీకి చెందిన సిహెచ్‌ రమణయ్య, టంగుటూరుకు చెందిన బాలబ్రహ్మచారిల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన మరో 16 మంది ప్రయాణీకులను చికిత్సల కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement