![Oil Leakage on Kanakadurga Fly Over Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/13/oil.jpg.webp?itok=ItfMmXgI)
రోడ్డు శుభ్రం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
తాడేపల్లిరూరల్: కృష్ణానది కనకదుర్గవారధిపై ఓ ట్యాంకర్‌లోనుంచి డీజిల్ ఆయిల్ లీక్ అవ్వడంతో వారధిపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న డీజిల్ టాంకర్‌లోనుంచి ఆయిల్ లీక్ అయింది. సుమారు 500 మీటర్ల పొడవునా ఆయిల్ లీక్ అయిన అనంతరం గమనించిన ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఆపి లీక్ అవుతున్న ఆయిల్‌ను నిలుపుదల చేశాడు. ఆయిల్ లీక్ అవ్వడంతో భారీ వాహనాలు సైతం జారిపోయాయి.
సమాచారం అందుకున్న తాడేపల్లి ట్రాఫిక్ సీఐ బ్రహ్మయ్య, తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి వెళ్లి, లీక్ అయి రోడ్డు మీద ఉన్న ఆయిల్‌పైన ఇసుక చల్లించి వాహనాలను వదిలారు. అయినప్పటికీ కార్లు, ద్విచక్రవాహనాలు జారుతూ ఉండడంతో తిరిగి మరలా ట్రాఫిక్ నిలిపివేసి మరోసారి ఇసుక చల్లించి దానిపైన సర్ఫ్ చల్లి విజయవాడ అగ్నిమాపక సిబ్బందిచేత నీళ్లు కొట్టించి శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేయడానికి గంటన్నర వ్యవధి పట్టడంతో కనకదుర్గవారధి 22వ కానా దగ్గర నుంచి కొలనుకొండ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు రోడ్డు శుభ్రం చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment