చంఢీగడ్: హర్యానాలోని నూహ్‌లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు.
కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి.
కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment