బొల్లాపల్లి మండల మేళ్లవాగు వద్ద వినుకొండ-కారంపూడి ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంక ర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ అదే వేగంలో ఓ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కారంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బొల్లాపల్లిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
Published Tue, Aug 2 2016 6:00 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement