నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్‌..33మంది మృతి | 33 killed in fuel tanker explosion in Kenya | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్‌..33మంది మృతి

Published Sun, Dec 11 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్‌..33మంది మృతి

నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్‌..33మంది మృతి

నైరోబీ: కెన్యా పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ ఘటన నాకురు-నైరోబీ రోడ్డులో రాత్రి 9.30గంటలకు సంభవించినట్లు తెలిపారు. వేగంగా వెళుతున్న ట్యాంకర్‌పై నియంత్రణ కోల్పోవడంతో కెరాయ్‌ ప్రాంతంలోని ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో పేలుడు సంభవించి అనూహ్యంగా పలువురు మృత్యువాత పడినట్లు చెప్పారు. ఈ వాహనంలో ప్రయాణీకులు కూడా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement