లండన్: భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు మంచి ప్రధాని కాగలరని కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో 48 శాతం అభిప్రాయపడుతున్నట్టు జేఎల్ పార్టనర్స్ సంస్థ సర్వేలో తేలింది. రిషి అత్యధికుల్ని ఆకర్షిస్తున్నారని జేఎల్ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ జాన్సన్ చెప్పారు. 39% మంది విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు మద్దతిచ్చారు.
రిషికి గట్టి పోటీగా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 33 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం! బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఆయన వారసుని కోసం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియకు తెర లేవడం తెలిసిందే. ఇప్పటిదాకా రెండు రౌండ్లలో అత్యధిక ఎంపీల మద్దతుతో రిషి రేసులో దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment