వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో భారత సంతతి పౌరుడు ధీరుడు అనిపించుకున్నాడు. తనను దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను చితక్కొట్టి పోలీసులకు పట్టించాడు. న్యూజిలాండ్లోని క్రిస్ట్ చర్చ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కమలేశ్ పటేల్ అనే వ్యక్తికి ఒపావా యూనివర్సల్ అనే ఓ డైయిరి ఉంది. అందులో ఆయన తన పనుల్లో నిమగ్నమై ఉండగా రాత్రి 7.40గంటల ప్రాంతంలో తన పనుల్లో నిమగ్నమై ఉండగా ఇద్దరు దొంగలు చొరబడ్డారు.
అతడి కన్నుగప్పి క్యాష్ బుక్ ఎత్తుకెళుతుండగా వారి దగ్గర ఏవైనా ఆయుధాలు ఉన్నాయేమో అనే ఆలోచన కూడా చేయకుండా అమాంతం వారిని వెంబడించాడు. వారిద్దరిని చితక్కొట్టాడు. అందులో ఒక దొంగ పారిపోగా, మరో దొంగను అలాగే అదిమిపట్టి పోలీసులకు పట్టించి శబాష్ అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియాకు తెలిపాడు. అయితే, ఆ క్యాష్ రిజిష్టర్ చాలా బరువుంటుందని, తాను కూడా మోయలేనంతగా ఉంటుందని, అందువల్లే దాన్ని పట్టుకొని పరుగెత్తడం వారికి సాధ్యం కాలేదని చెప్పాడు.
ఫారిన్ దొంగలను ఉతికారేసిన ఇండియన్
Published Tue, Feb 9 2016 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement