Kamlesh Patel
-
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
యోగా, ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఒకే ఛత్రం కిందకు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతి, విద్వేషపూరిత వాతావరణం నేపథ్యంలో మానవజాతి మేలు కోసం దేశంలోని యోగా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకే ఛత్రం కిందకు రావాల్సిన అవసరముందని శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ పటేల్ (దాజీ) అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలోని కాన్హా శాంతి వనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దాజీతోపాటు పతంజలి యోగా పీఠం అధ్యక్షుడు యోగా గురు రాందేవ్ బాబా పాల్గొన్నారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో ప్రారంభమవుతోందని సంస్థ సెక్రటరీ ఉమాశంకర్ బాజ్‌పేయి తెలిపారు. కొత్తగా నిర్మించిన ధ్యాన కేంద్రం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, ఏకకాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు సౌకర్యాలున్నాయని ఆయన చెప్పారు. రాజ యోగం, సహజ మార్గంలో యోగ శిక్షణ ఉంటుందని, 3 రోజుల శిక్షణతో పాటు వారానికి ఒక రోజు చొప్పున 15 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామని సంస్థ జాయింట్ సెక్రటరీ చల్లగుళ్ల వంశీ వెల్లడించారు. అభ్యాసం చేయాలనుకునేవారు ఆన్లైన్లో (https://heartfulness.org) రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కాన్హా శాంతి వనానికి రావొచ్చు. ప్లేస్టోర్, ఐఫోన్ స్టోర్‌లోని హార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇళ్లల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
ఫారిన్ దొంగలను ఉతికారేసిన ఇండియన్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భారత సంతతి పౌరుడు ధీరుడు అనిపించుకున్నాడు. తనను దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను చితక్కొట్టి పోలీసులకు పట్టించాడు. న్యూజిలాండ్‌లోని క్రిస్ట్ చర్చ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కమలేశ్ పటేల్ అనే వ్యక్తికి ఒపావా యూనివర్సల్ అనే ఓ డైయిరి ఉంది. అందులో ఆయన తన పనుల్లో నిమగ్నమై ఉండగా రాత్రి 7.40గంటల ప్రాంతంలో తన పనుల్లో నిమగ్నమై ఉండగా ఇద్దరు దొంగలు చొరబడ్డారు. అతడి కన్నుగప్పి క్యాష్ బుక్ ఎత్తుకెళుతుండగా వారి దగ్గర ఏవైనా ఆయుధాలు ఉన్నాయేమో అనే ఆలోచన కూడా చేయకుండా అమాంతం వారిని వెంబడించాడు. వారిద్దరిని చితక్కొట్టాడు. అందులో ఒక దొంగ పారిపోగా, మరో దొంగను అలాగే అదిమిపట్టి పోలీసులకు పట్టించి శబాష్ అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియాకు తెలిపాడు. అయితే, ఆ క్యాష్ రిజిష్టర్ చాలా బరువుంటుందని, తాను కూడా మోయలేనంతగా ఉంటుందని, అందువల్లే దాన్ని పట్టుకొని పరుగెత్తడం వారికి సాధ్యం కాలేదని చెప్పాడు.