నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం
వెల్లింగ్టన్: నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన ప్రవాస భారతీయుడొకరికి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడిని తాజిందర్ పాల్ సింగ్(29)గా గుర్తించారు. తాత్కాలిక విజిట్ వీసాపై వచ్చిన అతడు క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో ఈ అకృత్యానికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
నిదిస్తున్న మహిళపై అత్యాచారం జరిపిన తర్వాత మరొకరి పాస్పోర్టుపై స్వదేశానికి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత న్యూజిలాండ్ ను తిరిగొచ్చాడు. అతడిపై అత్యాచారం, పాస్పోర్టు అక్రమాలకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం తాజిందర్ కు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.