ముగ్గురు చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలాడు | Indian Origin Sikh Man Dies While Trying to Save 3 Children In California | Sakshi
Sakshi News home page

ముగ్గురు చిన్నారులను కాపాడి.. తన ప్రాణాలు వదిలాడు

Published Sat, Aug 8 2020 2:46 PM | Last Updated on Sat, Aug 8 2020 3:46 PM

Indian Origin Sikh Man Dies While Trying to Save 3 Children In California - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న ముగ్గురూ పిల్లలను కాపాడే క్రమంలో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలను కొల్పోయాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడగా మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. స్థానిక మీడియా‌ ప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, ఓ పదేళ్ల బాలుడు కలిసి నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. (చదవండి: విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..)

వారు ఆడుకుంటుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఒడ్డు మీద నిలుచున్న మజీద్‌ సింగ్‌ వారిని చూసి కాపాడేందుకు నదిలో దూకాడు. వారిని కాపాడే క్రమంలో మజీద్‌ నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు 40 నిమిషాల అనంతరం మజీద్‌ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరూ సురక్షితం ఉన్నారని, మరో ఎనిమిదేళ్ల చిన్నారి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement