
కోదండరాం
ఈ నెల 3 నుంచి 5 వరకు ఫిలడెల్ఫియాలో జరుగుతున్న ఆటా సభలకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు.
షికాగో (అమెరికా) నుంచి జి.గంగాధర్
ఈ నెల 3 నుంచి 5 వరకు ఫిలడెల్ఫియాలో జరుగుతున్న ఆటా సభలకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. ఇప్పటికే ఇక్కడికి టీఆర్‌ఎస్ నాయకుడు వి. ప్రకాష్ చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమం, ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాల గురించి కోదండరాం ప్రసంగిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ పని తీరు, అమలు చేయనున్న పథకాల గురించి వి. ప్రకాష్ వివరిస్తారు. ఈ సభలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హాజరవుతున్నారు. సినిమా నటీనటులు శ్రీయ, సునీల్, రాణా దగ్గుబాటి తదితరులు వస్తున్నారు. సభలకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తెలిపారు.