
ఫిలడెల్ఫియా : నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆహ్వానం పలికింది. సారంగ వెబ్ సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు. ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 15 వేలు, రెండో బహుమతికి రూ. 10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు ఇవ్వనున్నారు. కవితల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 5 వేలు, రెండో బహుమతికి రూ. 3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు.
జూన్ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది. పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు. రచనలు Literaty@nata2018.org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment