ఫిలడెల్ఫియాలో ఘటనాస్థలిలో పోలీస్ వాహనాలు
ఫిలడెల్ఫియా: అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే మరో రెండు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి బాల్టిమోర్‌లో బ్లాక్‌పార్టీపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 28 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి టెక్సాస్, ఫిలడెలి్ఫయాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరు బాలురు సహా మరో 10 మంది గాయపడ్డారు.
ఫిలడెల్పియాలోని కింగ్‌సెస్సింగ్‌లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సాయుధుడు వీధుల్లో తిరుగుతూ కనబడిన వారిపైకి కాల్పులు సాగించాడు. సమాచారం అందుకుని పోలీసులు చుట్టుముట్టడంతో అతడు లొంగిపోయాడు. ఆగంతకుడి వద్ద నుంచి ఏఆర్ రైఫిల్, హ్యాండ్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి కాల్పుల్లో అయిదుగురు చనిపోయారు. మరో ఇద్దరు 2, 13 ఏళ్ల బాలురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మరో ఘటన..టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌లోస్థానిక ఉత్సవం కోమోఫెస్ట్‌లో పాల్గొన్న జనంపైకి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 8 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment