వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్త దానం
Published Mon, Sep 11 2017 5:04 PM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM
ఫిలడెల్ఫియా :
ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతి సందర్బంగా ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్(అమెరికా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి, వైఎస్ఆర్సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్, రీజినల్ ఇంచార్జి రమేష్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసులు హాజరయ్యారు.
ఈ రక్తదాన శిబిరంలో 150 మంది రక్త దానం చేయగా, 400మందికిపైగా పాల్గొని వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరి, శివ మేక, పూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్, బోర్డు సభ్యులు ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్లం, గీత దోర్నాదుల, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సాగంరెడ్డి, రవి మరక, భానోజీ రెడ్డి, హరి కురుకుండ, వంశి బొమ్మారెడ్డి, ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement