జైపూర్ : రాజస్థాన్‌లో స్పైస్‌జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున‍్న దుబాయ్-జైపూర్ స్పైస్ జెట్ 58 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
టేక్ ఆఫ్ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక టైర్ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం జైపూర్ విమానాశ్రయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది.
Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy
— ANI (@ANI) June 12, 2019
Comments
Please login to add a commentAdd a comment