jaipur airport
-
Video: సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప చెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి.
జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమ ఉద్యోగికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండగా నిలిచింది. పోలీస్ అధికారి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.అతని నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ద్యోగి వద్ద సరైన ప్రవేశ పాస్ కలిగి ఉన్నప్పటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించాడని, అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపింది.Why is @flyspicejet trying to save it's female employee who was trying to enter through wrong-gate and then slapped #CISF officer? Has #SpiceJet done even a bit of investigation before jumping to support its errant employee?🤨#SpiceJetSlapGate #Jaipurpic.twitter.com/v24theSBaB pic.twitter.com/6di1KG5seP— India Crooks (@IndiaCrooks) July 11, 2024 కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు తగిన అనుమతి లేదని అన్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్‌లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట. ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official — Dia Mirza (@deespeak) May 20, 2022 -
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో స్పైస్‌జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున్న దుబాయ్-జైపూర్ స్పైస్ జెట్ 58 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. టేక్ ఆఫ్ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక టైర్ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం జైపూర్ విమానాశ్రయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy — ANI (@ANI) June 12, 2019 -
కిలో బంగారం దాటించేస్తూ అడ్డంగా దొరికాడు..
జైపూర్ : అడ్డదారుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు అధికారుల కళ్లు కప్పేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. జైపూర్ ఎయిర్‌పోర్టులో 30 సంవత్సరాల వ్యక్తి తన మలద్వారంలో బంగారాన్ని దాచి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు వమ్ము చేశారు. థాయ్ ఎయిర్వేస్ విమానంలో ఆదివారం రాత్రి జైపూర్ చేరుకున్న పంకజ్ సాదువాని ప్రవర్తనపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేయడంతో అవాక్కయ్యారు. తాను కిలో బంగారం విలువకలిగిన ఆరు పీస్‌లను తన ప్రైవేట్ పార్ట్స్‌లో దాచానని విచారణ సందర్భంగా సాధువాని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధువానిని తదుపరి విచారణ నిమిత్తం ప్రశ్నిస్తున్నామని కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ హోషియార్ సింగ్ వెల్లడించారు. -
బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం
జైపూర్: ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్‌లోని సంగనర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయిన తర్వాత పార్క్ చేసే క్రమంలో ఎయిరో బ్రిడ్జిని ఢీకొట్టింది. విమానం రెక్క ఒకటి బ్రిడ్జికి తగలడంతో స్వల్పంగా అది దెబ్బతిన్నది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఢిల్లీ నుంచి శనివారం ఉదయం 174మంది ప్రయాణీకులతో బయలుదేరి వచ్చిన 6ఈ-962 ఇండిగో విమానం తొలుత విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత దానిని పార్కింక్ చేసేందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని, దర్యాప్తునకు ఆదేశించామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం పీ బన్సల్ తెలిపారు. తమ అంతర్గత భద్రతా వ్యవహారాలు చూసే బృందంతో విచారణ చేయిస్తామని ఇండిగో తెలిపింది. -
అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టులు సింగ్‌పూర్ ‘చాంగి’ చేతికి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాలను సింగపూర్‌కు చెందిన చాంగి ఎయిర్పోర్ట్ గ్రూప్ నిర్వహించనున్నది. విమానాశ్రయాల నిర్వహణను ఒక విదేశీ సంస్థ చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ రెండు విమానాశ్రయాల టెర్మినళ్ల కార్యకలాపాలను, పార్కింగ్ వ్యవహారాలను చాంగి ఎయిర్పోర్ట్ గ్రూప్ నిర్వహిస్తుందని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ(ఏఏఐ) చైర్మన్ ఆర్.క. శ్రీవాత్సవ చెప్పారు. ఈ గ్రూప్‌కు చెందిన టీమ్ ఒకటి ఈ నెలాఖరుకు భారత్‌కు వస్తుందని, ఏఏఐ అధికారులతో చర్చలు జరుపుతారని సమాచారం. చాంగి ఎయిర్పోర్ట్ గ్రూప్ సింగపూర్ చాంగి విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. -
విమానాశ్రయాల ప్రైవేటీకరణ గడువు పెంపు
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభివృద్ధి చేసిన ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ మళ్లీ వాయిదా పడింది. చెన్నై, కోల్‌కత, లక్నో, గౌహతి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని వచ్చే నెల 17కు, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు వచ్చే నెల 12కు పొడిగించామని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిమిత్తం కంపెనీలను ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేయగలదని ఉన్నతాధికారొకరు వెల్లడించారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవడం, తాజాగా గడువు పొడిగింపు తదితర కారణాల వల్ల మొత్తం ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులంటున్నారు. కాగా వేల కోట్ల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.