జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమ ఉద్యోగికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండగా నిలిచింది. పోలీస్ అధికారి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
అతని నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ద్యోగి వద్ద సరైన ప్రవేశ పాస్ కలిగి ఉన్నప్పటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించాడని, అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది.
డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపింది.
Why is @flyspicejet trying to save it's female employee who was trying to enter through wrong-gate and then slapped #CISF officer? Has #SpiceJet done even a bit of investigation before jumping to support its errant employee?🤨#SpiceJetSlapGate #Jaipurpic.twitter.com/v24theSBaB pic.twitter.com/6di1KG5seP
— India Crooks (@IndiaCrooks) July 11, 2024
కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు తగిన అనుమతి లేదని అన్నారు.
ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment