సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk
— ANI (@ANI) July 2, 2022
ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది.
SpiceJet: On July 2 @flyspicejet Q400 aircraft was operating SG-2962 (Delhi-Jabalpur). While passing 5000ft, the crew noticed smoke in the cabin. The pilots decided to return back to Delhi. Aircraft landed safely & passengers were safely disembarked.
— Poulomi Saha (@PoulomiMSaha) July 2, 2022
pic.twitter.com/N6cu7kFj0e
Comments
Please login to add a commentAdd a comment