
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు గురువారం త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని హైదరాబాద్ వెళుతుండగా కర్నూలు శివారులో ఆర్టీసీ కాలనీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎడమ వైపు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్ అప్రమత్తమై వేగాన్ని తగ్గించి ఆపడంతో ప్రమాదం తప్పింది.
అనంతరం కర్నూలు బీక్యాంప్‌లో నివాసం ఉంటున్న దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్నేహితుడు అయ్యపురెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని ఆమె మరో వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అయ్యపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఏపీఎస్పీ రెండో పటాలంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా పేలిపోయిన టైర్లను మార్చి వాహనాన్ని సిద్ధం చేసుకుని డ్రైవరు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు విజయమ్మ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. విజయమ్మ వెంట ఇద్దరు కుటుంబసభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment