
టేకాఫ్ అవుతుండగా ఎమర్జెన్సీ విండో తీసి..
ముంబయి: విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించి తొందరుపాటు చర్యకు దిగాడు. ఓ ఇండిగో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. టేకాఫ్‌కు ముందు అతడు అనూహ్యంగా డోర్ ఓపెన్ చేశాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవరాక్షన్ చేసిన చేసిన ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.