ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : భారత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారుల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే గాల్లో రెండో విమానాలు ఢీకొని పెను ప్రమాదం సంభవించేదని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పేర్కొంది. గువాహతి నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి గువాహతి వస్తున్న రెండు ఇండిగో విమానాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒకదానికి ఒకటి ఢీకునేలా దగ్గరకు వచ్చాయి. తొలుత కోల్‌కతా ఫ్లైట్ 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. చెన్నై విమానం 35,000 అడుగుల్లో ప్రయాణిస్తోంది. అయితే కోల్‌కతా విమానంకు బంగ్లాదేశ్ ఏటీసీ అధికారులు 35,000 అడుగుల్లో ప్రయాణించాలని సూచించడంతో ఈ రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి.( చదవండి: టేకాఫ్‌కు కొన్ని నిముషాల ముందు..)
ఇది గుర్తించిన భారత ఏటీసీ అధికారులు వెంటనే చెన్నై-గువాహతి ఫ్లైట్‌ను కుడివైపు టర్న్ తీసుకుని, కోల్‌కతా విమానంకు దూరంగా వెళ్లాలని సూచించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం రెండు విమానాల మధ్య ఎత్తు వెయ్యి అడుగుల వ్యత్యాసం ఉండాలి. అయితే కోల్‌కతా విమానం బంగ్లా అధికారులు సూచనలతో కిందికి రావడంతో రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి. ఈ ఘటనపై ఏఏఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండిగో అధికారప్రతినిధి మాత్రం ఈ సంఘటనపై ఎలాంటి సమాచారం అందలేదన్నాడు. ఇటీవల ఇండోనేషియాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: సముద్రంలో కూలిన విమానం)
Comments
Please login to add a commentAdd a comment