Air Traffic Control
-
రష్యాలో విమాన ప్రమాదం.. 28 మంది మృతి
మాస్కో: రష్యాలోని పెట్రోపావ్లోవిస్్క– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయింది. విమానం ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో విమానానికి సంబంధించి శకలాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆంటోనోవ్ ఏఎన్–26 విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సొలొడోవ్ చెప్పారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా. -
క్యాపిటల్ బిల్డింగ్ విమానంతో కూల్చేస్తాం!
వాషింగ్టన్: అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలైమని మృతికి ప్రతీకారంగా అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి కూల్చేస్తామనే ఆడియో మెసేజ్ కలకలం సృష్టించింది. సోమవారం ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీల మధ్యలో ఈ మెసేజ్ వినిపించింది. దీంతో ఎఫ్‌బీఐ, ఎఫ్ఏఏలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయని సీబీఎస్ సంస్థ తెలిపింది. ‘బుధవారం మేము క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి ధ్వంసం చేస్తాం. సొలైమని మృతికి ప్రతీకారం తప్పదు’ అని ఎవరూ గుర్తుపట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్‌తో ఈ మెసేజ్ రికార్డు చేశారు. బుధవారం ఈ బిల్డింగ్‌లో యూఎస్ కాంగ్రెస్ సమావేశమై బైడెన్ గెలుపును ధ్రువీకరించనుంది. 2020 జనవరి 3న సొలైమని మిస్సైల్ దాడిలో మరణించారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత సొలైమని మృతికి ప్రతీకారమంటూ మెసేజ్ వినిపించడం రక్షణ వర్గాల్లో కలకలం సృష్టించింది. సొలైమని మరణం ఇరాన్లో తీవ్ర భావావేశాలు రేకెత్తించింది. ఇందుకు ప్రతిగా ఇరాక్‌లో పలుమార్లు పలువురు యూఎస్ వ్యక్తులపై, ఎంబసీపై దాడులు జరిగాయి. ఇరాన్ కోర్టులు ట్రంప్ సహా పలువురు యూఎస్ అధికారులపై అరెస్టు వారెంటులు జారీ చేశాయి. -
‘పాకిస్తాన్ ఏటీసీ వ్యాఖ్యలతో ఆనందం, ఆశ్చర్యం..’
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో జర్మనీకి విమానాలు నడిపిన ఎయిర్ ఇండియాపై పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ పౌరులను తరలించేందుకు, ఆయా దేశాల నుంచి కరోనా రిలీఫ్ మెటీరియల్స్‌ను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా పలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 2న రెండు ఎయిర్ ఇండియా విమానాలు పాకిస్తాన్ గగన తలం మీదుగా వెళ్తుండగా.. వాటికి అనుమతినివ్వడంతో పాటు.. ‘ఆస్ సలాం ఆలేకూం (మీకు శాంతి కలుగుతుంది). ఇది కరాచీ కంట్రోల్ రూమ్. ఎయిర్ ఇండియా రిలీఫ్ ఫ్లైట్లకు స్వాగతం’అని చెప్పడం ఆనందం, ఆశ్చర్యం కలిగించిందని ఎయిర్ ఇండియా పైలట్ పాక్ ఏటీసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. (చదవండి: 18 విమానాలు నడుపుతాం: ఎయిరిండియా) తొలుత పాకిస్తాన్ ఏటీసీ సిబ్బందిని సంప్రదిస్తే.. స్పందన రాలేదని, అనంతరం వారు తమను సంప్రదించి గొప్పగా రిసీవ్ చేసుకున్నారని పైలట్ చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవలపట్ల గర్వంగా ఉంది. గుడ్ లక్’ అని పాక్ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు. ‘పాకిస్తాన్ అనుమతితో కరాచీ గుండా వెళ్లిన ఎయిర్ ఇండియా విమానాలకు 15 నిముషాల సమయం కలిసి వచ్చింది. అది మాత్రమే కాకుండా.. ఇరాన్ గగనతలంలోకి వెళ్లే ముందు.. ఆ దేశ వైమానిక సిబ్బందిని సంప్రదించడంలో ఇబ్బందులు తలెత్తితే పాకిస్తాన్ ఏటీసీ సాయం చేసింది. దాంతో ఇరాన్ కూడా మా గమ్యం త్వరగా చేరుకునే దిశగా మార్గం చూపించింది’ అని ఎయిర్ ఇండియా పైలట్ తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా సేవలపై టర్కీ, జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా ప్రశంసలు కురిపించారు. (చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్) -
జస్ట్ మిస్.. లేకుంటే పెను ప్రమాదమే!
న్యూఢిల్లీ : భారత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారుల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే గాల్లో రెండో విమానాలు ఢీకొని పెను ప్రమాదం సంభవించేదని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పేర్కొంది. గువాహతి నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి గువాహతి వస్తున్న రెండు ఇండిగో విమానాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒకదానికి ఒకటి ఢీకునేలా దగ్గరకు వచ్చాయి. తొలుత కోల్‌కతా ఫ్లైట్ 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. చెన్నై విమానం 35,000 అడుగుల్లో ప్రయాణిస్తోంది. అయితే కోల్‌కతా విమానంకు బంగ్లాదేశ్ ఏటీసీ అధికారులు 35,000 అడుగుల్లో ప్రయాణించాలని సూచించడంతో ఈ రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి.( చదవండి: టేకాఫ్‌కు కొన్ని నిముషాల ముందు..) ఇది గుర్తించిన భారత ఏటీసీ అధికారులు వెంటనే చెన్నై-గువాహతి ఫ్లైట్‌ను కుడివైపు టర్న్ తీసుకుని, కోల్‌కతా విమానంకు దూరంగా వెళ్లాలని సూచించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం రెండు విమానాల మధ్య ఎత్తు వెయ్యి అడుగుల వ్యత్యాసం ఉండాలి. అయితే కోల్‌కతా విమానం బంగ్లా అధికారులు సూచనలతో కిందికి రావడంతో రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి. ఈ ఘటనపై ఏఏఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండిగో అధికారప్రతినిధి మాత్రం ఈ సంఘటనపై ఎలాంటి సమాచారం అందలేదన్నాడు. ఇటీవల ఇండోనేషియాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) -
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
-
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
లండన్ : జర్మనీ గగనతలంలో జెట్‌ఎయిర్‌వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్777 విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జర్మనీ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రెండు ఫైటర్ జెట్లు బోయింగ్777 విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించారు. చివరకు క్షేమంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబధించి వీడియో ఫూటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెండు జర్మనీకి చెందిన ఫైటర్ జెట్లు బోయింగ్777 విమానానికి ఎస్కార్టుగా వచ్చిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 335 మంది ప్రయాణికులతో పాటూ 15 మంది సిబ్బంది ఉన్నారు. -
విమానంపై లేజర్ దాడి!
లండన్: అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానంపై లేజర్ కిరణాల దాడి జరగడంతో లండన్‌లోని హిత్రూ విమానాశ్రయానికి వెనుదిరిగింది. ఈ కిరణాలు కళ్లపై పడటంతో ఓ పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. ఘటన జరిగినపుడు విమానంలో 252 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది ఉన్నారు. విమానం లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే లేజర్ కిరణాల దాడి జరిగింది. దీంతో ముందుకు కొనసాగడం కన్నా వెనుదిరగడమే మేలని భావించిన పైలట్లు ఐరిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే లేజర్ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లండన్‌లో 2010 నుంచి ఇప్పటి వరకు 1,300 లేజర్ దాడులు జరిగాయని తెలిపారు. -
పైలట్.. దారి మర్చిపోయాడు!
రోడ్డుమీద కారులో వెళ్తుంటే ఒకోసారి మనం సరిగా దారి తెలియక తప్పిపోతాం. అదే విమానాలైతే.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితంగా వెళ్తాయి. కానీ, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయల్దేరి, దాదాపు గంట పాటు తప్పుడు దిశలో వెళ్లిపోయింది! ఎంహెచ్132 అనే ఈ విమానం ఆక్లండ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలి. అందుకు ఆస్ట్రేలియా మీదుగా వాయవ్య దిశలో నేరుగా వెళ్లాలి. కానీ, రాడార్ డేటాను బట్టి చూస్తే.. అది దక్షిణ దిశగా దాదాపు గంటపాటు ప్రయాణించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలట్లు.. ఆక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో చర్చిస్తున్నా, ప్రయాణికులకు మాత్రం చెప్పలేదు. విమానం ఇలా వెళ్లడం వల్ల దానికి ప్రమాదం ఏమీ రాలేదుగానీ, అసలు సాధారణంగా వెళ్లాల్సిన మార్గాన్ని ఎందుకు మార్చారనే దానిపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. -
చైనాలో ఇక వాళ్లంతా ఇంగ్లిషే మాట్లాడాలి
చైనాలో ఇంగ్లిషు వాడకం చాలా తక్కువ. ప్రత్యేకంగా అక్కడివాళ్లకు ఇంగ్లిషు నేర్పించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటిది.. 2017 నుంచి ఆ దేశంలో పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కేవలం ఇంగ్లిషులోనే మాట్లాడుకోవాలట. ఈ మేరకు చైనా పౌర విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విదేశీ పైలట్లకు ఇంగ్లిషులో చెబుతుండగా, చైనా పైలట్లకు మాత్రం మాండరిన్ భాషలో చెబుతున్నారు. ఇక మీదట చైనాలో విమానయాన కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిష్‌లోనే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆగ్నేయాసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు పైలట్లు ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. అయితే చైనా పైలట్లు ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇప్పుడు కొంత కష్టమే అవుతుంది. చాలామందికి కేవలం ఆరు నెలల శిక్షణ మాత్రమే ఇచ్చారు. దాంతో అంత త్వరగా ఇంగ్లిష్ ఎలా నేర్చుకోవాలో.. ఎలా మాట్లాడాలో తెలియక తల పట్టుకుంటున్నారు.