
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూనే టేకాఫ్ తీసుకుంది. పైలట్ తీరుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ కావడం చూసి షాక్ అయ్యారు.
అయితే ఐదు నిమిషాల తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వేపై వెలుతురు సరిగా లేకపోవడంతోనే పైలట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment