
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, హుటాహుటిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోకి స్టార్ ఆసుపత్రికి తరలించారు.
కాగా, మిజోరం గవర్నర్ హరిబాబు సోమవారం ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో, హరిబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఎమర్జెన్సీగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.