kambhampati hari babu
-
గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న హరిబాబును కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఓ మూవీ షూటింగ్ కోసం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు.(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)కాగా.. ఇప్పటికే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సమంత- నాగచైతన్య విడాకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాటిని ఊపేక్షించేది లేదని చిరంజీవి, మంచువిష్ణు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు.విశాఖ: మిజోరాం గవర్నర్ ను కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున ఆనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్ హరి బాబుకు నాగార్జున పరామర్శ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హరిబాబుఅక్కినేని తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హరిబాబు@iamnagarjuna #Vizag #Nagarjuna #Meets #MizoramGovernor pic.twitter.com/fcndH5nFNu— Akhil Raj (@RRajkumar135192) October 3, 2024 -
శంషాబాద్‌లో గవర్నర్ హరిబాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, హుటాహుటిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోకి స్టార్ ఆసుపత్రికి తరలించారు.కాగా, మిజోరం గవర్నర్ హరిబాబు సోమవారం ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో, హరిబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఎమర్జెన్సీగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
‘చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు’
-
‘చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అడిగింది బీజేపీనే అని ఆ పార్టీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై బుక్ లెట్ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి హోదా అడిగింది బీజేపీనేనని, హోదాతో కలిగే ప్రయోజనాల్నీ నిధుల రూపంలో ఇస్తున్నామని చెప్పారు. హోదావల్ల వచ్చే ప్రయోజనం దాదాపు 16 వేల కోట్ల రూపాయాలు ఉంటుందని, అందులో భాగంగానే ఇప్పటికే ఏపీకి 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారని, దీనిపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. అయితే ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పైగా కేంద్రం దగా చేసిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 3 వేల కోట్లు ఏపీకి విడుదల చేసింది నిజం కాదా అని చంద్రబాబును హరిబాబు ప్రశ్నించారు. పలు కేంద్ర పథకాల కింద 2017-18లో 17,500 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని వెల్లడించారు. చంద్రబాబు సింగపూర్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీగడ్డపై ప్రధానిపై విమర్శలు చేసిన సంప్రదాయం ఇప్పటివరకూ లేదన్నారు. ఈ నెల 20న చంద్రబాబు దీక్ష చేస్తాననడంలో ఆంతర్యమేమిటని హరిబాబు ప్రశ్నించారు. -
చంద్రబాబు వల్లే బీజేపీపై దాడులు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం వల్లే తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ పార్టీపై సీపీఐ చేసిన దాడిని హరిబాబు ఖండించారు. బీజేపీపై జరిగిన దాడి అప్రజాస్వామికమని, కమ్యూనిస్ట్‌ల ఫాసిస్ట్ ఆలోచనలకు నిదర్శనమన్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ కార్యక్రమంపై దాడి చేయడం విశాఖలో కొత్త విధానం, సంస్కృతిగా మారిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీపై చేసిన దాడులకు మద్దతు ఉందని ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతు కమ్యూనిస్టులకు నైతిక బలమిచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని పేర్కొన్నారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ నిర్వీర్యమైన ప్రభుత్వముందో, రాబోయే రోజుల్లోనూ అలాంటి నిర్వీర్యమైన ప్రభుత్వమే వస్తుందన్నారు. -
విభజన హామీలు అమలు చేస్తున్నాం
-
ఓటు వేసింది బిర్యానీ తినడానికా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో లంచగొండి ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారని.. పేదవాడికి ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వేజోన్ కోసం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ఢిల్లీ రమ్మంటే రాలేదని వెల్లడించారు. ప్రజలు ఆయనకు ఓటు వేసింది ఎందుకు? బిర్యానీ తినడానికా? అని ప్రశ్నించారు. ఏపికి ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తున్నారని, సీఎం చంద్రబాబును పూచికపుల్లలా చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరగడానికి చంద్రబాబు, వెంకయ్య నాయుడు కారణమన్నారు. -
కేంద్రానికి హరిబాబు కీలక లేఖ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఈనెల 11న ఆయన లేఖ రాశారు. తమ రాష్ట్రం నుంచే పాలన సాగాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు తన అధికారిక కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ, రాజధాని అమరావతి నుంచే పాలన సాగుతోందని తెలిపారు. హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విడగొట్టాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తున్న నేపథ్యంలో అమరావతిలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు అడుగులు పడ్డాయని వెల్లడించారు. అలాగే తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌ను నియమించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ నరసింహన్‌ను వెంటనే మార్చాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఇంతకుముందు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్‌ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ప్రత్యేక హోదా అర్హత ఏపీకి లేదు
► కేంద్రం నుంచి చంద్రబాబు బయటకొస్తే ప్రజలకే నష్టం ► కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, అడవులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, బాగా వెనుకబడిన ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా అర్హత ఉందని చెప్పారు. ఈ నాలుగింటిలో ఆంధ్రప్రదేశ్ దేంట్లోనూ లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూలోటు అధికంగా ఉండి రాష్ట్రం వెనుకబడటంతో ప్రత్యేక హోదా కావాలని మొదట్లో అడిగినట్లు తెలిపారు. ’ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం-ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై అవగాహన’ పేరుతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో ఏపీలో ఏర్పడే రూ. 22 వేల కోట్ల రెవెన్యూలోటును కేంద్రం అందజేస్తుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 2 లక్షల 6 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. ఆర్థిక సంఘం కేటారుుంపుల్లో ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. పోలవరం పూర్తిచేసే బాధ్యతను కేంద్రం చిత్తశుద్ధితో చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రాన్ని సాయం అడగడానికి బాబు భయపడుతున్నారనడంలో అర్థం లేదన్నారు. కొందరు కేంద్రం నుంచి బయటకు వచ్చేయమని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారని, దానివల్ల అటు మోదీకి, ఇటు బాబుకి ఎటువంటి నష్టం లేదన్నారు. దానివల్ల నష్టం ప్రజలకేనని వ్యాఖ్యానించారు. భారీ వర్షంతో అస్తవ్యస్తం.. సభ ప్రారంభమైన అరగంట అనంతరం కుండపోతగా వర్షం కురవడంతో అంతా అస్తవ్యస్తంగా మారింది. వానలోనే వెంకయ్య ప్రసంగం కొనసాగించగా సభాస్థలి నుంచి జనం వెళ్లిపోయారు. -
బీజేపీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్
-
బీజేపీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్
అన్యాయంపై ప్రశ్నించడమే తప్పా అని నగరపార్టీ నేతల ఆగ్రహం సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ నాయకులకు అన్యాయం జరుగుతోందంటూ సోమవారం విజయవాడలోని ఆ పార్టీ నగర కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకుగానూ పార్టీ నగర అధ్యక్షుడైన దాసం ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సస్పెండ్ నిర్ణయం ప్రకటించిన గంటలోపే 30 మంది డివిజన్ అధ్యక్షులు ప్రత్యేకంగా సమావేశమై సస్పెండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తీర్మానం కాపీతో సహా రాష్ట్ర నాయకత్వంపై నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. -
అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చుపై ఆ పార్టీ నేత దాసం ఉమామహేశ్వరరాజు నోరువిప్పారు. ఈ విషయంపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్టులలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే తాను చెసిన తప్పా? అని ప్రశ్నించారు. తనను విజయవాడ నగర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏకపక్షంగా వ్యవహరించి తనను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.ఎలాంటి విచారణ లేకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. కాగా, నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ అపాయింట్మెంట్ అడిగితే... హరిబాబు చిందులు
విశాఖపట్నం: అఖిలపక్షంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం న్యూఢిల్లీలో చిందులేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయను అని కరాఖండిగా స్పష్టం చేశారు. అయినా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినవన్నీ అమలు చేయాలని ఉందా అంటూ అఖిలపక్షంలో పాల్గొన్న ఎంపీలపై హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదివారం పార్లమెంట్ లైబ్రరీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభలో ఆ పార్టీ నేతలు అయిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వస్తున్న ఎంపీ హరిబాబును ఏపీ ఎంపీలు కలిశారు. రైల్వే జోన్ వ్యవహారం ఎటు తేలకుండా ఉందని... ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు అని ఈ సందర్భంగా హరిబాబుకు ఎంపీలు గుర్తు చేశారు. దీంతో ఆయన స్పందన పైవిధంగా ఉంది. విశాఖపట్నంకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ గట్టిగా వినబడుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాకు అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి కించిత్ స్పందన కూడా లేదు. ఈ అంశంపై టీడీపీ నేతలు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు.