అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్ | dasam umamaheswara raju tears on his suspension | Sakshi
Sakshi News home page

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్

Published Tue, Oct 4 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చుపై ఆ పార్టీ నేత దాసం ఉమామహేశ్వరరాజు నోరువిప్పారు. ఈ విషయంపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్టులలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే తాను చెసిన తప్పా? అని ప్రశ్నించారు. తనను విజయవాడ నగర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏకపక్షంగా వ్యవహరించి తనను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.ఎలాంటి విచారణ లేకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.  

కాగా, నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement