హరిబాబుకు 'విజయవాడ' షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు విజయవాడ నగర శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా మంగళవారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజును సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు
నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు హరిబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఉమామహేశ్వరరాజు ఆరోపించారు.