vijayawada bjp president
-
హరిబాబుకు 'విజయవాడ' షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు విజయవాడ నగర శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా మంగళవారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజును సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు హరిబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. -
అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సస్పెన్షన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చుపై ఆ పార్టీ నేత దాసం ఉమామహేశ్వరరాజు నోరువిప్పారు. ఈ విషయంపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్టులలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే తాను చెసిన తప్పా? అని ప్రశ్నించారు. తనను విజయవాడ నగర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏకపక్షంగా వ్యవహరించి తనను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.ఎలాంటి విచారణ లేకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. కాగా, నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బెజవాడ బీజేపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చు వివాదానికి దారితీస్తోంది. విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజుపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు అడిగితే సస్పెండ్ చేస్తారా అని దాసం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.