
బీజేపీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్
అన్యాయంపై ప్రశ్నించడమే తప్పా అని నగరపార్టీ నేతల ఆగ్రహం
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ నాయకులకు అన్యాయం జరుగుతోందంటూ సోమవారం విజయవాడలోని ఆ పార్టీ నగర కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకుగానూ పార్టీ నగర అధ్యక్షుడైన దాసం ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సస్పెండ్ నిర్ణయం ప్రకటించిన గంటలోపే 30 మంది డివిజన్ అధ్యక్షులు ప్రత్యేకంగా సమావేశమై సస్పెండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తీర్మానం కాపీతో సహా రాష్ట్ర నాయకత్వంపై నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.